News January 10, 2026
ఫైనల్లో నిఖత్, హుసాముద్దీన్

జాతీయ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో తెలుగు బాక్సర్లు నిఖత్ జరీన్(51 కేజీలు), హుసాముద్దీన్(60 కేజీలు) ఫైనల్‌కు దూసుకెళ్లారు. సెమీస్‌లో నిఖత్ 4-1 తేడాతో కుసుమ్ బఘేల్‌ను చిత్తు చేశారు. ఫైనల్లో ఆమె 2023 వరల్డ్ ఛాంపియన్ నీతూ గంగ్వాస్‌ను ఎదుర్కోనున్నారు. రామన్‌పై హుసాముద్దీన్ 4-1 తేడాతో గెలిచి ఫైనల్ బౌట్‌కు సిద్ధమయ్యారు. ఇక యంగ్ బాక్సర్ జాదుమణి సింగ్ సీనియర్ బాక్సర్ అమిత్ పంఘాల్‌కు షాకిచ్చి ఫైనల్ చేరారు.
Similar News
News February 10, 2026
ఓ అధికారి తలుచుకుంటే వచ్చే మార్పు ఇదే!

తీవ్రమైన చలిలో పిల్లలు చెప్పులు లేకుండా నడుస్తూ స్కూలుకు వెళ్లడం చూసి IAS జితేంద్ర కుమార్ సోనీ మనసు తల్లడిల్లింది. అప్పటికప్పుడు ‘చరణ్ పాదుక అభియాన్’ ప్రారంభించి 15 రోజుల్లోనే దాతల సాయంతో వేలమందికి పాదరక్షలు అందించారు. ఇది రాజస్థాన్ మొత్తం వ్యాపించగా.. ఇప్పటివరకు 1.5 లక్షల మంది పిల్లలు ఉచితంగా పాదరక్షలు పొందారు. ఒక అధికారిలోని మానవత్వం, చిత్తశుద్ధి కలిస్తే సమాజంలో వచ్చే మార్పునకు ఈ ఘటనే నిదర్శనం.
News February 10, 2026
స్పీకర్‌కు కాంగ్రెస్, BJP పోటాపోటీ లేఖలు!

ప్రతిపక్షాల నిరసనలతో ఊహించని పరిస్థితి ఎదురుకావచ్చని, <<19058377>>లోక్‌సభకు రావద్దని<<>> మోదీకి చెప్పానని స్పీకర్ ఓంబిర్లా వ్యాఖ్యానించడం తెలిసిందే. దీంతో తమ పరువుకు నష్టం కలిగించే ఆరోపణలు చేశారంటూ కాంగ్రెస్ మహిళా MPలు స్పీకర్‌కు లేఖ రాశారు. దీనికి కౌంటర్‌గా లెటర్ రాసిన BJP మహిళా MPలు.. ఆ రోజు గందరగోళం సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సభ గౌరవాన్ని నిలబెట్టేందుకు సహనం ప్రదర్శించారని ఆయన్ను కొనియాడారు.
News February 10, 2026
గోర్లు విరిగిపోకుండా ఉండాలంటే?

గోళ్లు కాస్త పెరగ్గానే పొడిబారి, పెళుసుగా మారి విరిగిపోవడానికి అవి తేమను కోల్పోవడం ఒక కారణం అంటున్నారు నిపుణులు. కాబట్టి నెయిల్స్‌కు తగినంత తేమను అందించడం చాలా ముఖ్యమంటున్నారు. ఇందుకోసం తగినంత వాటర్ తాగాలి. మాయిశ్చరైజర్‌ను గోరు మొదలు(క్యుటికల్) చుట్టూ పూసి, చేతులకు కాటన్ గ్లౌజుల్ని ధరించాలి. విటమిన్ ఈ, ఆలివ్ ఆయిల్ రాయడం వల్ల కూడా నెయిల్స్ తిరిగి తేమను పొందుతాయంటున్నారు.


