News March 9, 2025
ఫైనల్లో పోరాడి ఓడిన శ్రీ సత్యసాయి జట్టు

గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ వేదికగా జరిగిన హాకీ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీ సత్యసాయి హాకీ జట్టు నిరాశపరిచింది. సీనియర్ పురుషుల హాకీ ఫైనల్లో శ్రీ సత్యసాయి జట్టు తిరుపతి జట్టుతో పోరాడి ఓడింది. శనివారం మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌లో శ్రీ సత్యసాయి హాకీ జట్టు 4-2తో ఓటమి చెందినట్లు సత్యసాయి జిల్లా హాకీ సెక్రెటరీ సూర్య ప్రకాశ్ తెలిపారు. జట్టును ముందుకు నడిపించిన కోచ్ హస్సేన్‌ను అభినందించారు.
Similar News
News February 13, 2026
ఇలాంటి అమ్మాయి భార్య కావాలంటున్న బాయ్స్

ఏ వయసులో ముచ్చట ఆ వయసులో తీరడం అన్నది నానుడి. కానీ నేటి యువత జీవితంలో స్థిరపడ్డాకే పెళ్లి అంటోంది. పదేళ్ల క్రితం పెళ్లి సగటు వయసు 27 ఉండగా ఇప్పుడది 29కి మారింది. ‘జీవన్ సాథీ’ సంస్థ 2016-2025లో చేసిన అధ్యయనంలో ఇది వెల్లడైంది. ఇక కులం పట్టింపు చాలా తగ్గి, డివోర్స్, భాగస్వామి మరణం తర్వాత రెండో పెళ్లి చేసుకునే వారి సంఖ్య పెరిగింది. కాబోయే భార్య సంపాదనా పరురాలై ఉండాలని 87% అబ్బాయిలు కోరుకుంటున్నారట.
News February 13, 2026
HYD: రేపే TG EAPCET నోటిఫికేషన్..!

JNTU, తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో నిర్వహించనున్న TG EAPCET 2026 ప్రవేశ పరీక్షకు సంబంధించి శనివారం ఉదయం నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు పరీక్షల కన్వీనర్ విజయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. 19వ తేదీ ఉదయం 11:30 గంటల నుంచి ఆన్‌లైన్‌లో విద్యార్థులు దరఖాస్తులు సమర్పించవచ్చని సూచించారు. ప్రతిఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. SHARE IT.
News February 13, 2026
ఇస్నాపూర్‌లో కాంగ్రెస్-బీఆర్ఎస్ వార్

ఇస్నాపూర్ పట్టణంలో గెలుపొందిన నలుగురు ఇండిపెండెంట్ ల అభ్యర్థుల కోసం కాంగ్రెస్, BRS పార్టీల నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. స్థానికంగా మొత్తం 26 వార్డులు కాగా కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 12, నలుగురు ఇండిపెండెంట్లు గెలిచారు. అయితే మ్యాజిక్ ఫిగర్ దాటాలంటే ఇండిపెండెంట్ కౌన్సిలర్లు కీలకంగా మారారు. ఇరు పార్టీల మధ్య వాగ్వాదం ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు రంగంలోకి దిగి చర్యలు తీసుకున్నారు.


