News December 2, 2025
ఫైనల్స్‌కు మహబూబ్‌నగర్- వరంగల్ బాలికల జట్లు

సిరిసిల్లలో జరుగుతున్న 8వ రాష్ట్ర స్థాయి జూనియర్ వాలీబాల్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ బాలికల విభాగంలో మహబూబ్‌నగర్, వరంగల్ జట్లు ఫైనల్‌కు చేరాయి. ఈరోజు ఉదయం జరిగిన మొదటి సెమీఫైనల్ మ్యాచ్‌లో మహబూబ్‌నగర్ జట్టు నిజామాబాద్ జట్టుపై విజయం సాధించగా, రెండో సెమీ ఫైనల్‌లో వరంగల్ జట్టు నల్గొండ జట్టుపై విజయం సాధించి ఫైనల్‌కు చేరినట్లు నిర్వాహకులు తెలిపారు.
Similar News
News April 5, 2026
కేజీ చికెన్ ధర ఎంతంటే?

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ చికెన్ ధరలు కేజీ రూ.230-రూ.300 మధ్య ఉన్నాయి. హైదరాబాద్‌లో ప్రాంతాలను బట్టి రూ.260 నుంచి రూ.290, వరంగల్‌లో రూ.280, కామారెడ్డి జిల్లాలో రూ.280-రూ.290 వరకు విక్రయిస్తున్నారు. విజయవాడలో రూ.230, గుంటూరులో రూ.250, విశాఖలో రూ.270, బాపట్లలో రూ.300కు అమ్ముతున్నారు. మీ ఏరియాలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.
News April 5, 2026
విశాఖ: ఇంటింటికీ మొబైల్ వాటర్ టెస్టింగ్ ల్యాబ్

విశాఖలో జీవీఎంసీ మొబైల్ వాటర్ టెస్టింగ్ ల్యాబ్ రోజుకు సుమారు 50 నీటి పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ ఏడాది జనవరి 1న ప్రారంభమైన ఈ ల్యాబ్ రాష్ట్రంలో తొలి మొబైల్ సదుపాయం. రూ.40 లక్షలతో ఏర్పాటైన ఈ వాహనం 98 వార్డుల్లో తిరుగుతూ ఇంటింటికీ వెళ్లి నీటి నాణ్యతను పరీక్షిస్తోంది. పీహెచ్, క్లోరిన్, టీడీఎస్, టర్బిడిటీ వంటి ప్రమాణాలను వెంటనే నిర్ధారిస్తున్నారు. ఇప్పటివరకు కాలుష్యం గుర్తించలేదని అధికారులు తెలిపారు.
News April 5, 2026
మాచర్ల CI వెంకటరమణ సస్పెన్షన్

AP: ప్రేమ వివాహం చేసుకున్న <<19545664>>చౌడేశ్వరిని<<>> నిబంధనలకు విరుద్ధంగా, బలవంతంగా ఆమె తల్లిదండ్రులకు అప్పగించినందుకు మాచర్ల CI వెంకటరమణను జిల్లా SP సస్పెండ్ చేశారు. ఈ క్రమంలో ఆయన బాధితురాలి తల్లిదండ్రుల నుంచి డబ్బులు తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యింది. CI అప్పగించిన కాసేపటికే ఆమె హత్యకు గురవడంతో ఈ నేరంలో ఆయన పాత్రపై ఆరోపణలొచ్చాయి. దీంతో CIపై SP కృష్ణారావు చర్యలు తీసుకున్నారు.


