News March 22, 2025
ఫైరింగ్ ప్రాక్టీస్‌లో పాల్గొన్న భూపాలపల్లి ఎస్పీ

భూపాలపల్లి జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మామునూరు బెటాలియన్ సమీపంలోని ఫైరింగ్ రేంజ్‌లో జిల్లాలోని పోలీసు అధికారులు ఈ ఏడాదికి సంబంధించిన ఫైరింగ్ ప్రాక్టీస్ చేశారు. ఈ సాధనలో ఎస్పీ కిరణ్ ఖరే, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని, పిస్టల్‌తో, AK 47, SLR, ఇన్సాస్, వివిధ ఆటోమేటిక్ వెపన్లతో ఫైరింగ్ సాధన చేశారు. పోలీసు అధికారులు తమ విధుల్లో వినియోగిస్తున్న ఆయుధాల పనితీరుపై పరిజ్ఞానం పెంచుకోవాలన్నారు.
Similar News
News March 22, 2025
కడప: అయ్యో.. ఈమె కష్టం ఎవరికీ రాకూడదు

కడప జిల్లా ముద్దనూరు(M)లో ఓ మహిళ గాథ కన్నీటిని తెప్పిస్తోంది. మండలంలోని ఉప్పలూరుకు చెందిన గోవిందు శ్యామల భర్త లక్ష్మయ్యను ఏడాది క్రితం పాము కాటు వల్ల కోల్పోయింది. ఈమెకు ఇద్దరు ఆడ సంతానం. కుటుంబ పోషణ కోసం స్కూల్‌లో వంట మనిషిగా పనిచేస్తోంది. శుక్రవారం తన చిన్న కుమార్తె కీర్తన(6) కారు ప్రమాదంలో మృతి చెందింది. ఆమెను చూసిన గ్రామస్థులు అయ్యో దేవుడా ఎంతా పని చేశావని కన్నీటి పర్యంతం అయ్యారు.
News March 22, 2025
కర్నూలులో పవన్ కళ్యాణ్ పర్యటన వివరాలు ఇలా..!

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు.
☞ ఉదయ 9.45 గంటలకు కర్నూలు విమానాశ్రయానికి చేరుకుంటారు
☞ 9.50 గంటలకు రోడ్డు మార్గాన ఓర్వకల్లు మండలం పూడిచెర్లలో నీటి కుంటల తవ్వకాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతారు
☞ 11.40 గంటలకు తిరిగి విమానాశ్రయం చేసుకుని బేగంపేట వెళ్తారు.
News March 22, 2025
VZM: జాగ్రత్త.. తేదీలను చింపేసి మరీ అమ్మకాలు!

విజయనగరం జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాప్స్, ఏజెన్సీలపై విజిలెన్స్ తనిఖీలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ తనిఖీల్లో నివ్వెర పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ధనార్జనే ధ్యేయంగా కొంతమంది అక్రమార్కులు అమాయకుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మత్తును కలిగించే ఔషధాలను ప్రిస్క్రిప్షన్ లేకుండా విక్రయిస్తున్నారు. వాటిపై ముద్రించిన తయారీ, ఎక్స్‌పైరీ తేదీలను చించి మరీ అమ్ముతున్నట్లు అధికారులు గుర్తించారు.