News February 6, 2025

ఫైళ్ల క్లియరెన్స్.. నిమ్మలకు 22వ ర్యాంకు

image

సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్‌లో వారి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఇందులో ప.గో జిల్లా మంత్రి నిమ్మల రామానాయుడు 22వ ర్యాంకు పొందారు. ఇకపై ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలని సూచించారు.

Similar News

News April 13, 2026

ప.గో : ఈ మున్సిపాలిటీలకు ఈసారైనా ఎన్నికలు జరిగేనా ?

image

పశ్చిమగోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం, తణుకు, భీమవరం, పాలకొల్లు మున్సిపాలిటీలకు సమీప గ్రామాల విలీనంపై కోర్టు కేసులు ఉండటంతో దాదాపు పదేళ్లుగా ఎన్నికలకు నోచుకోలేదు. ప్రస్తుతం డీలిమిటేషన్ ప్రక్రియ జరుగుతోంది. ముగియగానే ఆగస్టు, సెప్టెంబర్ నెలలో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం భావిస్తోంది. 4 మున్సిపాలిటీలకు కోర్టు కేసులు పరిష్కారం తర్వాతే ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

News April 12, 2026

ప.గో: భర్త కళ్లెదుటే మహిళ తలపై నుంచి వెళ్లిన లారీ

image

ఉండి రైల్వే గేటు సమీపంలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉదయశ్రీ(56) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల వివరాలు.. ఉంగుటూరు మండలం బొమ్మిడి గ్రామానికి చెందిన నాగరాజు నరసింహారాజు, తన భార్య ఉదయశ్రీతో కలిసి పెద్దపుల్లేరులో జరుగుతున్న ఆలయ ప్రతిష్ఠ మహోత్సవాలకు బైకుపై వెళ్తుండగా, వెనుక నుంచి వచ్చిన లారీ వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఉదయశ్రీ తల పైనుంచి లారీ వెళ్లడంతో ఆమె మృతి చెందింది.