News February 6, 2025

ఫైళ్ల క్లియరెన్స్.. సుభాశ్‌కు లాస్ట్ ర్యాంకు

image

సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. గతేడాది జూన్ 12న మంత్రులుగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి డిసెంబర్ వరకు ఫైళ్ల క్లియరెన్స్‌లో వారి పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అనంతరం సీఎం ఈ ర్యాంకులను ప్రకటించారు. ఇందులో అంబేడ్కర్ కోనసీమ జిల్లా మంత్రి వాసంశెట్టి సుభాశ్ 25వ ర్యాంకు పొందారు. ఇకపై ఫైళ్లను వేగంగా క్లియర్ చేయాలని సీఎం సూచించారు.

Similar News

News February 6, 2025

బోయినిపల్లి: దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్న సుడిగాలి సుధీర్

image

బోయినపల్లి మండలంలోని వరద వెళ్లి గ్రామంలో గుట్టపై వెలిసిన శ్రీ దత్తాత్రేయ స్వామిని జబర్దస్త్ నటులు సుడిగాలి సుధీర్, రాంప్రసాద్ దర్శించుకున్నారు. ఈరోజు దత్తాత్రేయ స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. స్వామివారి కృప అందరిపై ఉండాలని కోరుకున్నారు. గుట్ట పైన ఎంతో ప్రకృతి అందాలతో బోటు ద్వారా వచ్చి దత్తాత్రేయుని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. నాగుల సాంబయ్య, భక్తులు ఉన్నారు.

News February 6, 2025

గోకవరం: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

కొత్తపల్లి నుంచి కామరాజుపేట వెళ్లే జంక్షన్ వద్ద గురువారం బైక్ అదుపుతప్పి రోడ్డుపై యువకుడు పడిపోయాడు. దీంతో అతడి తలకు బలంగా దెబ్బ తగిలినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే 108కు కాల్ చేసి గోకవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే యువకుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News February 6, 2025

భీమారం: తాళం వేసిన ఇంట్లో చోరీ

image

భీమారంలోని ఐటీడీఏ కాలనీలో తాళం వేసిన ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. భీమారం ఎస్ఐ శ్వేత వివరాల ప్రకారం.. రాంటెంకి రంజిత్ కుమార్ జనవరి 31న తన కొడుకు అక్షరాభ్యాసం కోసం సిద్దిపేట మండలంలోని శనిగారం గ్రామానికి వెళ్లాడు. కాగా ఈనెల 5న ఇంటికి తిరిగి వచ్చి చూసేసరికి బీరువాలో రూ.50వేల నగదు, రూ.42వేల విలువ గల బంగారం చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.

error: Content is protected !!