News January 3, 2026
ఫొటో సిమిలర్ ఎంట్రీలు త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్‌లో భాగంగా ఫొటో సిమిలర్ ఎంట్రీల ప్రక్రియను నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని కలెక్టర్ (జిల్లా ఎన్నికల అధికారి) రాహుల్ శర్మ తెలిపారు. జిల్లాలో రివిజన్ మ్యాపింగ్ 56.87 శాతం పూర్తయిందన్నారు. ఓటరు జాబితా స్వచ్ఛత, పారదర్శకత కోసం ఈ ప్రక్రియ కీలకమని చెప్పారు. బూత్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో జాగ్రత్తగా పరిశీలించి అర్హులైన ఓటర్ల వివరాలు సరిచేయాలని ఆదేశించారు.
Similar News
News January 28, 2026
ICET షెడ్యూల్ విడుదల

TG: MBA, MCA కాలేజీల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ICET-2026 షెడ్యూల్ విడుదలైంది.
*ఫిబ్రవరి 6న నోటిఫికేషన్
*ఫిబ్రవరి 12 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు
*మార్చి 16- దరఖాస్తులకు చివరి తేదీ
*మే 13, 14న కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్
**అప్లికేషన్ ఫీజు ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.550, ఇతర అన్ని విభాగాల వారికి రూ.750. డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులూ అప్లై చేసుకోవచ్చు.
News January 28, 2026
గద్వాల: ‘పీఎండీడీకేవైతో రైతుల ఆర్థికాభివృద్ధే లక్ష్యం’

పీఎండీడీకేవై (PMDDKY) పథకం ద్వారా రైతులు ఆర్థికంగా ఎదిగేలా కృషి చేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ కాంత్ దూబే అధికారులకు సూచించారు. బుధవారం గద్వాల కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఈ పథకానికి గద్వాల జిల్లా ఎంపికైన నేపథ్యంలో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో దీనిని సమర్థవంతంగా అమలు చేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు.
News January 28, 2026
మేడారంలో బెల్లంతో రూపుదిద్దుకున్న అమ్మవార్ల విగ్రహాలు!

వనదేవతల జాతర మేడారంలో అపురూప ఘట్టం ఆవిష్కృతమైంది. భక్తులు తమ ఆరాధ్య దైవాలైన సమ్మక్క-సారలమ్మల విగ్రహాలను అత్యంత భక్తిశ్రద్ధలతో బెల్లంతో మలిచారు. బెల్లానికి నిలయమైన ఈ క్షేత్రంలో, అమ్మవార్లను పట్టువస్త్రాలు, నగలతో సర్వాంగ సుందరంగా అలంకరించి పూజలు చేశారు. అడవితల్లి ఆశీస్సుల కోసం గిరిజన సంప్రదాయ రీతిలో మొక్కులు చెల్లించుకుంటూ పులకించిపోయారు.


