News January 29, 2025

ఫోటోగ్రపీలో కోనసీమ యువకుడు ప్రతిభ

image

ఈనెల 27,28 తేదీల్లో సఖినేటిపల్లి ప్రొఫెషనల్ ఫోటో,వీడియోగ్రాఫర్ అసోసియేషన్ అధ్వర్యంలో కేశనపల్లి లో ఫోటోగ్రఫీ వర్క్ షాప్ నిర్వహించారు. ఇందులో రాజోలు మండలం పొదలాడ గ్రామానికి చెందిన కాకర రవితేజ తీసిన ఫోటోకు బంగారు పథకం లభించింది. రెండు రోజులపాటు జరిగిన ఈవర్క్ షాప్ లో సుమారు 40 మంది పాల్గొన్నారు. ఫోటో గ్రాపర్స్ అసోసియేషన్ నాయకులు రవితేజకు బంగారు పథకం అందజేశారు.

Similar News

News February 25, 2026

వంటింటి చిట్కాలు

image

* పాత్రలు శుభ్రం చేయడానికి ఉపయోగించే నీటిలో కొద్దిగా బేకింగ్ సోడా కలిపితే నీచు వాసన రాకుండా ఉంటాయి.
* తేనె ముద్దగా అయితే, కాసేపు సీసాను వేణ్ణీళ్ళలో ఉంచండి.
* ప్లాస్టిక్ డబ్బాలు వాడనప్పుడు వాటిల్లో కాస్త ఉప్పు వేసి ఉంచితే, తిరిగి వాడుకునేప్పుడు ప్లాస్టిక్ వాసన రాదు.
* ఆలుగడ్డలు (బంగాళా దుంపలు) ఉడికించేప్పుడు ఆ నీళ్ళలో రెండు చుక్కల నిమ్మరసం లేదా కాస్త వెనిగర్ వేస్తే తెల్లగా వస్తాయి.

News February 25, 2026

HYD: షీ టీమ్స్ అదుపులో 264 మంది పోకిరీలు

image

నాంపల్లి ఎగ్జిబిషన్‌లో షీ టీమ్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేసి 264 మంది ఆకతాయిలను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 242 మంది మేజర్లు, 22 మంది మైనర్లు ఉన్నట్లు గుర్తించారు. 56 మందిపై పెట్టీ కేసులు నమోదు చేయగా, 52 మందికి కోర్టు రూ.1,050 జరిమానా విధించింది. మరో నలుగురికి 2 రోజుల జైలు శిక్షతో పాటు రూ.1000 జరిమానా విధించింది. 188 మందికి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు.

News February 25, 2026

ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలపై కీలక ప్రకటన

image

AP: ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాల వర్తింపుపై మంత్రి DBV స్వామి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. నెలకు రూ.10వేల కంటే ఎక్కువ ఆదాయం ఉంటే పథకాలు వర్తించవని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి రూ.1.20 లక్షలు, పట్టణాల్లో రూ.1.44 లక్షలు ఆదాయం మించి ఉంటే పథకాలకు అనర్హులు అని పేర్కొన్నారు.