News March 15, 2025
‘ఫోటో ఓటర్ జాబితా తయారీకి ప్రతి ఒక్కరు సహకరించాలి’

పారదర్శక, స్వచ్ఛమైన ఫోటో ఓటరూ జాబితా తయారీలో భాగంగా నిరంతర మార్పులు, చేర్పుల విషయంలో రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘానికిసహకరించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఓటరూ జాబితా తయారీలో ఎప్పటికప్పుడు వస్తున్నమార్పులు, చేర్పులు, తదితర అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులతో శనివారం నల్గొండ కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో సమావేశం నిర్వహించారు.
Similar News
News July 9, 2025
నల్గొండ: ఆర్థిక ఇబ్బందులతో కౌలు రైతు ఆత్మహత్య

కనగల్‌కి చెందిన కౌలు రైతు గోనెల చిన్న యాదయ్య (45) ఆర్థిక ఇబ్బందులు తాళలేక బుధవారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఏఎస్ఐ ఎస్.రామయ్య తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన యాదయ్య తనకున్న కొద్దిపాటి భూమితో పాటు మరికొంత భూమిని కౌలుకు తీసుకొని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సాగులో నష్టాలు రావటంతో ఇవాళ మధ్యాహ్నం బలవన్మరణానికి పాల్పడ్డాడు. యాదయ్య మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది.
News July 9, 2025
NLG: తాడిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడి మృతి

కేతేపల్లి మండలం చీకటిగూడెంలో విషాదం జరిగింది. గ్రామానికి చెందిన గీత కార్మికుడు జానయ్య ప్రమాదవశాత్తు తాడిచెట్టు పైనుంచి పడ్డాడు. ఈ క్రమంలో మోకు మెడకు చుట్టుకోవడంతో అక్కడికక్కడే చనిపోయాడు. జానయ్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిది పేద కుటుంబమని, ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. మృతదేహాన్ని నకిరేకల్ మార్చురీకి తరలించారు.
News July 9, 2025
NLG: స్థానిక ఎన్నికల నిర్వహణకు కసరత్తు

జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు వేగవంతమయ్యాయి. ఇప్పటికే గ్రామపంచాయతీల సరిహద్దులపై ప్రభుత్వానికి అధికారులు నివేదిక పంపించారు. గ్రామాల్లో వార్డులను కూడా ఖరారు చేశారు. తాజాగా మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (MPTCల) పునర్విభజన షెడ్యూల్‌ను ప్రకటించారు. నల్గొండ జిల్లాలో 352కు ఎంపీటీసీ స్థానాలు పెరిగాయి.