News September 8, 2025

‘ఫోటో ట్రేడ్ ఎక్స్‌పో’ పోస్టర్ ఆవిష్కరణ

image

భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఫోటో ట్రేడ్ ఎక్స్‌పో-2025 పోస్టర్‌ను సోమవారం ఆవిష్కరించారు. ఈ ఎక్స్‌పో సెప్టెంబర్ 19 నుంచి 21 వరకు హైదరాబాద్‌లోని నార్సింగ్‌లోని ఓం కన్వెన్షన్ హాల్‌లో జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రదర్శనలో ఆధునిక కెమెరాలు, డ్రోన్లు, లెన్స్‌లు, ప్రింటింగ్ పరికరాలు, సాఫ్ట్‌వేర్లను ప్రదర్శిస్తామని వారు పేర్కొన్నారు. ఫొటోగ్రాఫర్లకు మంచి అవకాశమని ఎస్పీ అభిప్రాయపడ్డారు.

Similar News

News September 9, 2025

విజయవాడ: బీచ్‌లో యువకుడి మృతి

image

విజయవాడ నుంచి బాపట్ల సూర్యలంక తీరానికి వచ్చిన యువకుడు అలల తాకిడికి గల్లంతై మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. విజయవాడ నుంచి వచ్చిన సాయి తీరంలో స్నానం చేస్తుండగా అలల తాకిడికి గల్లంతయ్యాడు. గల్లంతయిన యువకుడి కోసం పోలీసులు, గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు ప్రారంభించగా కాసేపటికి మృత దేహం లభ్యమైంది.

News September 9, 2025

కరీంనగర్: ప్రైవేట్ హాస్పిటల్స్ ఇష్టారాజ్యం

image

ఉమ్మడి KNRలో పలు ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటల్స్ విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నాయి. నిబంధనలు పాటించకుండా డయాగ్నొస్టిక్స్, ల్యాబ్స్, మెడికల్స్ ఏర్పాటు చేసుకుంటున్నారు. అనుమతి లేకుండా విజిటింగ్ డాక్టర్స్‌తో వైద్యం చేయిస్తున్నారు. ప్రమాణాలు పాటించని హాస్పిటల్స్‌పై అధికారులు తనిఖీలు చేసి నోటీసులు ఇచ్చినా పట్టించుకోవడం లేదు. వైద్యం పేరుతో వేల ఫీజులు తీసుకుంటూ సరైన సేవలు అందించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి.

News September 9, 2025

నేటి నుంచి ఎడ్‌సెట్ కౌన్సెలింగ్

image

ఏపీలో నేటి నుంచి ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ మొదలుకానుంది. విద్యార్థులు ఈనెల 12వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 10నుంచి 13వరకు జరుగుతుంది. వెబ్‌ఆప్షన్ల నమోదు 13 నుంచి 15వరకు ఉండనుంది. వెబ్ ఆప్షన్స్ 16న ఎడిట్ చేసుకోవచ్చు. 18న సీట్ల కేటాయింపు ఉంటుంది. సీటు పొందిన విద్యార్థులు ఈ నెల 19, 20న కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి.