News September 24, 2025

ఫోటో, వీడియో కెమెరామెన్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి: కలెక్టర్

image

భద్రాద్రి జిల్లా ప్రజా సంబంధాల అధికారి కార్యాలయంలో ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేయుటకు ఫోటో కెమెరామెన్ (1), వీడియో కెమెరామెన్ (1) పోస్టుల భర్తీకి అర్హతగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. ఈ నెల 26వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 గంటల లోగా దరఖాస్తులు కార్యాలయంలో సమర్పించాలని ఆయన సూచించారు.

Similar News

News September 24, 2025

ఆసియా కప్: శ్రీలంక ఇంటికే..!

image

ఆసియా కప్‌ సూపర్-4లో రెండు మ్యాచుల్లో ఓటమితో శ్రీలంక ఫైనల్ ఆశలు దాదాపు గల్లంతయ్యాయి. ఆ జట్టు ఫైనల్ చేరాలంటే భారత్ తర్వాతి రెండు మ్యాచుల్లో భారీ తేడాతో ఓడాల్సి ఉంటుంది. ప్రస్తుతం సూర్య సేన ఫామ్‌ను చూస్తే అది అసాధ్యమే అని చెప్పొచ్చు. అటు రేపటి మ్యాచులో బంగ్లాదేశ్‌ పాక్‌ను ఓడించడంతో పాటు ఈ నెల 26న టీమ్ ఇండియాపై శ్రీలంక తప్పనిసరిగా గెలవాలి. ఇదంతా జరిగినా NRR ఆధారంగానే ఫైనలిస్టులు ఖరారు అవుతాయి.

News September 24, 2025

ఆదిలాబాద్‌: మమ్మల్ని అనాథలను చేయకండి..!

image

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కుటుంబ కలహాలు కలకలం సృష్టిస్తున్నాయి. గొడవలతో వివాహితులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. సోమవారం కాగజ్‌నగర్‌లో ఓ వివాహిత తన కుమార్తెతో కలిసి సూసైడ్ చేసుకోగా.. ఇటీవల జైనథ్ మండలానికి చెందిన మరో వివాహిత బలవర్మరణానికి పాల్పడింది. ఇలాంటి ఘటనలతో పిల్లలు తమ తల్లిదండ్రులకు దూరమై అనాథలుగా మారుతున్నారు. తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించండి. అఘాయిత్యాలకు పాల్పడకండి.

News September 24, 2025

భీమవరంలో మిస్సింగ్.. గుంటూరులో ప్రత్యక్షం

image

భీమవరానికి చెందిన ఓ బాలుడు ఇంటి నుంచి పారిపోవడంతో పోలీసులు గుంటూరులో ఉన్నట్లు గుర్తించారు. భవాని దీక్షకు కుటుంబ సభ్యులు నిరాకరించడంతో ఆ బాలుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అందిన ఫిర్యాదుతో పోలీసులు చర్యలు చేపట్టారు. బాలుడు అమరావతిలోని మేనమామ ఇంటికి వెళ్లి ఉండవచ్చని పోలీసులు అనుమానంతో గుంటూరు రైల్వే చైల్డ్ కేర్‌కు సమాచారం ఇచ్చారు. వారు బాలుడిని గుంటూరులో గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.