News November 20, 2025

ఫోన్‌పే టాప్!

image

మన దేశంలో యూపీఐ చెల్లింపుల్లో ఫోన్‌పే ఆధిపత్యం కొనసాగుతోంది. 45.47% మార్కెట్ షేర్‌తో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత గూగుల్ పే (34.62%), పేటీఎం (7.36%), Navi (2.78%), సూపర్ మనీ (1.28%) ఉన్నాయి. ఫోన్‌పే, గూగుల్ పే కలిపి 80 శాతానికి పైగా మార్కెట్ షేర్‌ను కలిగి ఉండటం విశేషం. BHIM, CRED లాంటి ప్లాట్‌ఫామ్స్ కూడా వినియోగిస్తున్నారు. మరి మీరు ఏది వాడుతున్నారో కామెంట్ చేయండి.

Similar News

News April 7, 2026

టికెట్ ధరల్ని పెంచిన ఎయిరిండియా

image

గ్లోబల్ మార్కెట్‌లో విమాన ఇంధన ధరలు పెరగడంతో ఎయిరిండియా డొమెస్టిక్, ఇంటర్నేషనల్ సర్వీసుల ఛార్జీలను పెంచింది. దేశీయంగా దూరాన్ని బట్టి ప్రయాణికులపై ₹299 నుంచి ₹899 వరకు అదనపు భారం పడనుంది. అంతర్జాతీయ రూట్లలో గరిష్ఠంగా 280 డాలర్ల వరకు ఇంధన సర్‌ఛార్జీని పెంచారు. పెరిగిన ధరలు ఏప్రిల్ 8 నుంచి అమల్లోకి రానున్నాయి. పశ్చిమాసియా యుద్ధం కారణంగా చమురు ధరలు పెరగడమే ఇందుకు కారణం.

News April 7, 2026

పాకిస్థాన్ ఎన్ని ముక్కలవుతుందో.. రాజ్‌నాథ్ వార్నింగ్

image

భారత్‌తో యుద్ధం వస్తే ఈసారి కోల్‌కతా వరకు వస్తామంటూ పాక్ మంత్రి ఖవాజా పలికిన <<19571096>>ప్రగల్భాలపై<<>> రక్షణ మంత్రి రాజ్‌నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బెంగాల్‌పై కన్నేస్తే ఈసారి పాక్ ఎన్ని ముక్కలవుతుందో ఆ దేవుడికే తెలుసన్నారు. ‘ఖవాజా వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయి. 55 ఏళ్ల కిందట ఇలాంటి మాటల వల్లే పాక్ రెండు ముక్కలైన విషయాన్ని మర్చిపోవద్దు’ అని చురకలంటించారు.

News April 7, 2026

అదొక్కటి సాధిస్తే ఇండియాలో 400 ఏళ్ల పాటు విద్యుత్ వెలుగులే(1/2)..

image

తాజాగా <<19586211>>కల్పాక్కం<<>>లో భారత్ రెండో దశ న్యూక్లియర్ ప్రోగ్రాంలో సక్సెస్ సాధించింది. ఇది ఇండియాకు పెద్ద విజయం. మన దేశంలో యురేనియం నిల్వలు తక్కువగా ఉన్నందున అణు పితామహుడు హోమీ బాబా 3దశల ప్రణాళికను రూపొందించారు. మొదట సహజ సిద్ధమైన U-238తో విద్యుదుత్పత్తి చేస్తారు. ఈ ప్రక్రియలో బై-ప్రొడక్ట్‌గా విలువైన ప్లుటోనియం-239 వెలువడుతుంది. ఇది తదుపరి దశలకు ఇంధనంగా మారుతుంది.