News January 20, 2026

ఫోన్‌పే IPOకు SEBI ఓకే

image

ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే IPOకు SEBI గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నియంత్రణ సంస్థ సూచనలతో అప్‌డేట్ చేసిన DHRPని ఫోన్‌పే త్వరలోనే సబ్మిట్ చేయనుంది. ఆఫర్ ఫర్ సేల్ రూపంలో IPOకు వస్తుండటంతో కంపెనీకి పబ్లిక్ ఇష్యూ ద్వారా కొత్తగా నిధులు సమకూరే అవకాశాలు లేవు. ఫ్రెష్ ఇష్యూలు కూడా ఉండవని తెలుస్తోంది. IPO విలువ రూ.12వేల కోట్లు ఉంటుందని అంచనా. ప్రస్తుత UPI లావాదేవీల్లో 45% ఫోన్‌పే యాప్‌ ద్వారానే జరుగుతున్నాయి.

Similar News

News April 2, 2026

రాష్ట్రంలో 4 రోజులు వర్షాలు!

image

తెలంగాణలో రానున్న 4 రోజుల పాటు వర్షాలు పడతాయని IMD వెల్లడించింది. గురువారం నుంచి శనివారం వరకు ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని చెప్పింది. ఆదివారం మధ్య తెలంగాణలోని నాలుగైదు జిల్లాలు మినహా రాష్ట్రమంతటా వానలు పడే అవకాశముందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో పిడుగులు పడే ఆస్కారముందని హెచ్చరించింది. పలుచోట్ల వడగళ్ల వాన పడుతుందని అంచనా వేసింది.

News April 2, 2026

బేర్ పంజా: నిన్న లాభాలు.. నేడు భారీ నష్టాలు

image

పశ్చిమాసియా యుద్ధంపై ట్రంప్ కీలక ప్రకటన నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. నిన్న లాభాలతో ముగియగా, ఇవాళ భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1400 పాయింట్లు నష్టపోయి 71,728 వద్ద ఉంది. అటు నిఫ్టీ 430 పాయింట్లు కోల్పోయి 22,251 వద్ద కొనసాగుతోంది. టెక్, ఫైనాన్స్, బ్యాంకింగ్ రంగ సంస్థల షేర్లన్నీ నష్టాలు చవిచూస్తున్నాయి.

News April 2, 2026

హనుమాన్ జయంతి.. ఇలా చేస్తే మనశ్శాంతి!

image

నేడు చైత్ర పౌర్ణమి సందర్భంగా దేశవ్యాప్తంగా హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఇవాళ ఆంజనేయుడి ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు చేసి హనుమాన్ చాలీసా, సుందరకాండ పారాయణం చేయాలి. బలం, భక్తికి నిదర్శనమైన పవన సుతుడిని కొలవడం వల్ల కష్టాలు తొలగి, మనశ్శాంతి లభిస్తుందని భక్తుల నమ్మకం. అంజన్న భక్తులు నేటి నుంచి మే 12 వరకు 41 రోజుల పాటు దీక్షను తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది.