News February 28, 2025
ఫోన్ల రికవరీలో అనంతపురం పోలీసుల రికార్డు

అనంతపురంలోని పోలీస్ పరేడ్ మైదానంలో శుక్రవారం మొబైల్ ఫోన్ రికవరీ మేళా నిర్వహించారు. ఈ మేళాలో జిల్లా ఎస్పీ జగదీశ్ రూ.2.95కోట్ల విలువ చేసే 1,183 ఫోన్లను బాధితులకి అందజేశారు. సాంకేతికత వినియోగించి ఫోన్లను రికవరీ చేశామని ఎస్పీ చెప్పారు. ఇప్పటి వరకు జిల్లా పోలీసు శాఖ 11,378 పోన్లు రికవరీ చేసిందని తెలిపారు. దేశంలో ఇదే అత్యధికమని చెప్పారు. వాటి విలువ సుమారు రూ.21.08 కోట్లు ఉంటుందని వెల్లడించారు.
Similar News
News February 28, 2025
బాధ్యతలు స్వీకరించనున్న ఏయూ వీసీ

ఆంధ్ర యూనివర్సిటీ నూతన వైస్ ఛాన్సలర్‌గా జి.పి.రాజశేఖర్ శనివారం బాధ్యతలు స్వీకరించనున్నట్లు ఏయూ రిజిస్ట్రార్ ధనుంజయరావు శుక్రవారం తెలిపారు. శనివారం ఉదయం బాధ్యతలు స్వీకరించిన అనంతరం యూనివర్సిటీ విభాగాల అధిపతులను కలుస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి సందర్శకులను కలవనున్నట్లు తెలిపారు. ఇన్నాళ్లు ఏయూ ఇన్ ఛార్జ్ వీసీగా ఉన్న శశిభూషణరావు రేపు బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు.
News February 28, 2025
భద్రాద్రి జిల్లా నేటి ముఖ్యాంశాలు..!

✓ ఏసీబీకి చిక్కిన కొత్తగూడెం టౌన్ కూలీలైన్ స్కూల్ HM
✓ చర్లలో ప్రాణం తీసిన అక్రమ ఇసుక రవాణా
✓ మణుగూరులో బండరాయితో బాది దారుణ హత్య
✓ మణుగూరులో హెల్త్ క్యాంపును పరిశీలించిన ఐటీడీఏ పీవో
✓ అశ్వాపురం రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
✓ మిర్చి రైతులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కనికరం లేదన్న సీపీఎం నేత
✓ జిల్లావ్యాప్తంగా జాతీయ సైన్స్ డే, టైలర్స్ డే వేడుకలు
✓ ఫిజికల్ ఫిట్నెస్ ఎంతో అవసరమన్న జిల్లా ఎస్పీ
News February 28, 2025
అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్

త్రివిక్రమ్-అల్లు అర్జున్ మూవీ షూటింగ్ ఈ నెలలో ప్రారంభమవుతుందన్న వార్తలను నిర్మాత నాగవంశీ ఖండించారు. ‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ ప్రమోషన్లలో ఆయన మాట్లాడారు. ఆ ప్రాజెక్టు ఈ ఏడాది సెకండాఫ్‌లోనే స్టార్ట్ అవుతుందని తెలిపారు. దీంతో ఐకాన్ స్టార్ అభిమానులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. పుష్ప-2 తర్వాత బన్నీ సినిమా ఏదీ ఇంకా మొదలవని విషయం తెలిసిందే.