News March 22, 2025

ఫోన్ చేసి సమస్యలు తెలపండి: నిర్మల్ కలెక్టర్

image

అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో మారుమూల ప్రాంతాల ప్రజల సహాయార్థం ప్రతి సోమవారం టెలిఫోన్ ప్రజావాణి నిర్వహించనున్నట్లు కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. ప్రతి సోమవారం ఉదయం 10:30 నుంచి 11 గంటల వరకు ప్రజలు తమ ఇంటి నుంచే 91005 77132 నంబర్‌కు కాల్ చేసి నేరుగా తమ సమస్యలను తెలుపవచ్చన్నారు. అలాగే ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కలెక్టరేట్‌లో యథావిధిగా ప్రజావాణి కొనసాగుతుందన్నారు.

Similar News

News September 16, 2025

అక్రమాస్తుల కేసుల విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

image

ఏపీ ఏసీబీ నమోదు చేసిన అక్రమాస్తుల కేసుల విచారణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విజయవాడ సెంట్రల్ ఇన్‌వెస్టిగేషన్ యూనిట్‌కి పోలీస్ స్టేషన్ హోదా లేదని 11 FIRలను హైకోర్టు కొట్టివేయగా ఏసీబీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేసులపై విచారణకు, ఛార్జ్‌షీట్‌ల దాఖలుకు అనుమతినిచ్చింది.

News September 16, 2025

మంజీరా నది ఉరకలేస్తుంది..!

image

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయిని నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి మళ్లీ పెరిగింది. దీంతో ప్రాజెక్టులోని తొమ్మిది గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ వరద ఉద్ధృతి కారణంగా పిట్లం మండలం బొల్లక్ పల్లి మంజీరా బ్రిడ్జి వద్ద మంజీర నది ఉరకలేస్తూ ప్రవహిస్తోంది. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి ఔట్‌ఫ్లో 62,542 క్యూసెక్కులుగా ఉంది.

News September 16, 2025

కామారెడ్డిలో ‘స్వస్త్ నారీ సశక్తి పరివార్ అభియాన్’

image

కామారెడ్డి జిల్లాలో ఈనెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు ‘స్వస్త్ నారీ సశక్తి పరివార్ అభియాన్’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అన్ని పీహెచ్‌సీల పరిధిలో ఈ కార్యక్రమం జరుగుతుందని కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. 15 రోజులు జరిగే కార్యక్రమం విజయవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు.