News January 16, 2026

ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రభాకర్ రావుకు బెయిల్ వస్తుందా?

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు, SIB మాజీ చీఫ్ ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సిట్ ఇప్పటికే ఆయన్ను 14 రోజులపాటు కస్టడీకి తీసుకొని విచారించింది. ఇందుకు సంబంధించి నివేదికను ఈరోజు కోర్టులో సమర్పించనుంది. ఆయన్ను అరెస్ట్‌ చేసేందుకు అనుమతి కోరే అవకాశముంది. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావుకు బెయిల్ వస్తుందా? లేదా అరెస్టుకు కోర్టు అనుమతిస్తుందా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Similar News

News February 21, 2026

తిరుమల క్షేత్రంలో విశిష్ట సేవ ‘అర్చన’

image

అర్చన అంటే స్వామివారి 1008 దివ్య నామాలను పఠిస్తూ, లోకకళ్యాణం కోసం ఆశీస్సులు కోరడం. ఈ సేవలో పాల్గొనే గృహస్థుల పేరు, గోత్రాలతో సంకల్పం చెబుతారు. ఇది కేవలం తిరుమల క్షేత్రానికే పరిమితమైన విశిష్ట సేవ. దీనికి సంబంధించి 1518 నాటి శాసనం కూడా ఉంది. రోజూ ఉదయం తెల్లవారుజామున 4:30 గంటలకు ఈ సేవ నిర్వహిస్తారు. ఇందులో మనం కూడా పాల్గొనవచ్చు. మంగళ, బుధ, గురువారాల్లో మాత్రమే భక్తులకు అనుమతి ఉంటుంది.

News February 21, 2026

IAF అగ్నివాయు నాన్ కంబాటెంట్ పోస్టులు.. అప్లై చేశారా?

image

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అగ్నివాయు నాన్ కంబాటెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. టెన్త్ అర్హతతో పాటు శారీరక ప్రమాణాలు కలిగిన వారు ఫిబ్రవరి 23 వరకు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. జులై 2, 2005-జనవరి 2, 2009 మధ్య జన్మించి ఉండాలి. స్క్రీనింగ్, రాత పరీక్ష, PFT, మెడికల్ టెస్ట్, DV ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://agnipathvayu.cdac.in

News February 21, 2026

ఆ కామెంట్స్ తర్వాత 3 రోజులు నిద్రపట్టలేదు: శివాజీ

image

హీరోయిన్ల డ్రెస్సింగ్‌పై తాను చేసిన వివాదాస్పద <<18692465>>వ్యాఖ్యలపై<<>> నటుడు శివాజీ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ఏ మహిళనూ తక్కువ చేయాలనే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేశారు. ‘నేను పబ్లిక్‌లో ఎప్పుడూ నోరు జారలేదు. ఆ రోజు 2 పదాలు ఎందుకు తప్పుగా మాట్లాడానో అర్థం కాలేదు. ఆ కామెంట్స్ తర్వాత 3 రోజులు నిద్ర పట్టలేదు. ఎంతో మానసిక సంఘర్షణకు గురయ్యా. కానీ నా ఉద్దేశం ఏంటో ప్రజలు అర్థం చేసుకున్నారు’ అని తెలిపారు.