News November 18, 2025
ఫోన్ పోయిన వెంటనే ఫిర్యాదు చేయాలి: ASF ఎస్పీ

మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న వారు వెంటనే CEIR వెబ్ పోర్టల్లో ఫిర్యాదు చేయాలని ASF జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ సూచించారు. మంగళవారం ASF ఎస్పీ కార్యాలయంలో సెయిర్ వెబ్ పోర్టల్ ద్వారా స్వాధీనం చేసుకున్న 41 మొబైల్ ఫోన్లను బాధితులకి అప్పగించారు. ప్రతి ఒక్కరికి మొబైల్ అనేది తప్పనిసరి వస్తువు అయిందన్నారు. ప్రతి చిన్న పనితో పాటు యూపీఐ లావాదేవీలకి సైతం మొబైల్ ప్రధానమన్నారు.
Similar News
News November 18, 2025
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి: ఎన్పీడీసీఎల్ సీఎండీ

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండి తమ భవిష్యత్తును కాపాడుకోవాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. మంగళవారం హనుమకొండలోని ఎన్పీడీసీఎల్ కార్యాలయంలో మాదకద్రవ్యాల నిరోధకంపై ఆయన ఉద్యోగులతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. డ్రగ్స్ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. కార్యక్రమంలో డైరెక్టర్లు మోహన్ రావు, తిరుపతి రెడ్డి, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.
News November 18, 2025
పాలమూరు: పరీక్షల టైం టేబుల్ విడుదల..!

పాలమూరు యూనివర్సిటీ పరిధిలో జరగనున్న 4 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ B.Ed (B.Sc. B.Ed. & B.A. B.Ed.) సెమిస్టర్ 1 (రెగ్యులర్) పరీక్షల తేదీలు (టైం టేబుల్)ను యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. ఈనెల 25 నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. మరిన్ని వివరాలకు యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ www.palamuruuniversity.comను చూడండి.
News November 18, 2025
మెదక్: ‘పార్లమెంట్‌లో చట్ట సవరణ చేయాలి’

టెట్ నుంచి మినహాయిస్తూ పార్లమెంట్‌లో చట్ట సవరణ చేయాలని పీఆర్టీయూ అధికార ప్రతినిధి వంగ మహేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. సుప్రీంకోర్ట్ తీర్పు ప్రకారం ఉపాధ్యాయులు ఉద్యోగంలో కొనసాగాలంటే రెండేళ్ల లోపు తప్పనిసరిగా టెట్ పాస్ కావాలనడం ఉపాధ్యాయులను ఎంతో మనోవేదనకు గురిచేస్తుందన్నారు. 25, 30 సంవత్సరాల సర్వీసు కలిగిన ఉపాధ్యాయులు ప్రస్తుతం టెట్ రాసి పాస్ కావడం అంటే చాలా శ్రమ, వేదనతో కూడుకున్నదన్నారు.


