News March 21, 2026

ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో 59 నియామకాలు పూర్తి: ఛైర్మన్

image

తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలో 60 పోస్టులకు 59 నియామకాలు పూర్తి చేశామని టీఎస్ఎల్‌పీఆర్‌బీ ఛైర్మన్ వీవీ శ్రీనివాసరావు తెలిపారు. సైంటిఫిక్ ఆఫీసర్, అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, అటెండెంట్ విభాగాల్లో ఎంపికలు జరిగాయి. అకడమిక్ మార్కులు, అనుభవం, రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేశారు. అభ్యర్థులు 23-25 తేదీల్లో ఆన్‌లైన్ ఫారాలు పూర్తిచేసి 30న హైదరాబాద్ పెట్లబుర్జ్ సీఏఆర్ కార్యాలయంలో ఇవ్వాలన్నారు.

Similar News

News April 13, 2026

భూపాలపల్లి: ఆశగా ఎదురుచూస్తున్న 18వేల మంది యువత..!

image

రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తులకు తప్ప అమలుకు నోచుకోలేదు. జిల్లా వ్యాప్తంగా సుమారు 18వేల మందికి పైగా దరఖాస్తు చేసుకోగా ఏడాది గడిచినా అమలుకు శ్రీకారం చుట్టలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం దరఖాస్తులను పరిశీలించి, అర్హులైన వారికి పథకం అమలు చేయాలని యువత కోరుతున్నారు.

News April 13, 2026

ఖమ్మం:జిల్లాకు చేరిన ఆర్‌ఎఫ్‌సీఎల్ ఎరువుల నిల్వలు

image

చింతకాని మండలంలోని పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు ఆదివారం 2,965 మెట్రిక్ టన్నుల ఆర్‌ఎఫ్‌సీఎల్ యూరియా చేరింది. జిల్లా వ్యవసాయాధికారి పుల్లయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నిల్వలను ఖమ్మం (585 టన్నులు), కొత్తగూడెం (880), మహబూబాబాద్ (500) జిల్లాలకు సరఫరా చేశారు. మరో 1,000 మెట్రిక్ టన్నుల యూరియాను అత్యవసర అవసరాల కోసం బఫర్ స్టాక్‌గా నిల్వ చేసినట్లు ఆయన వెల్లడించారు.

News April 13, 2026

పిచ్చి పీక్స్.. చందమామపై ‘ట్రంప్ టవర్’

image

చంద్రునిపై తన పేరుతో టవర్ ఉన్నట్లు చూపే AI ఫొటోను US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ SM అకౌంట్‌లో పోస్ట్ చేశారు. నాసా చేపట్టిన ఆర్టెమిస్-2 మిషన్ విజయవంతంగా ముగిసిన సందర్భంగా ఆయన ఈ పోస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది. గోల్డ్ ఫినిషింగ్‌తో మెరిసిపోతున్న ఈ భవనం చంద్రమండలంపై అమెరికా ఆధిపత్యాన్ని సూచిస్తున్నట్లుగా ఉంది. అంతరిక్ష రంగంలో US ఎప్పటికీ టాప్‌లో ఉంటుందని తెలిపేలా ట్రంప్ ఈ విధంగా పోస్ట్ చేశారు.