News July 30, 2024

ఫోర్జరీ కేసులో శివకృష్ణ అరెస్టు.. 14 రోజుల రిమాండ్

image

నెల్లూరు నగరంలోని కార్పొరేషన్ కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన ఘటన సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. నెల్లూరు నగర డీఎస్పీ శ్రీనివాసులు రెడ్డి, దర్గామిట్ట సీఐ అల్తాఫ్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఫోన్ నిందితుడు శివకృష్ణను పోలీసులు అరెస్ట్ చేసి మంగళవారం కోర్టుకు హాజరు పరిచారు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ ను విధించింది.

Similar News

News February 28, 2026

అన్నదాతకు రూ.25 వేల మద్దతు ధర వచ్చేనా.?

image

వరికి ఒక క్వింటా ₹2389 లెక్కన పుట్టి ధర ₹21330 వరకు A- గ్రేడ్ రకానికి ఇస్తుండగా సాధారణ రకానికి పుట్టి ధర ₹20,136 చొప్పున నిర్ణయించారు. అయితే కేంద్రాల్లో ధాన్యం విక్రాయించాలంటే తరుగులతో కొంత తీసేస్తుండగా గొనె సంచులు, రవాణా ఖర్చులు రైతులే భరించాల్సి ఉంది. దీంతో ఎకరాకు రూ.35-40 వేల వరకు ఖర్చు అవుతుండగా రైతుకు రూ.20 వేలు కూడా మిగలడం లేదు. ప్రభుత్వం పుట్టికి రూ.25 వేల మద్దతు ధర ఇవ్వాలని రైతులు కోరారు.

News February 28, 2026

నెల్లూరు: 3.45 లక్షల ఎకరాల్లో వరిసాగు.!

image

ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు మద్దతు ధరలు దక్కడం లేదు. జిల్లాలో ఈ ఏడాది రబీలో 3.45 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. దాదాపు 10 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం దిగుబడి రానుంది. వచ్చే నెల నుంచి జిల్లాలో 161 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా.. 5 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

News February 27, 2026

UPSC అభ్యర్థులకు ట్యాబ్‌ల అందజేత

image

యూపీఎస్సీ(UPSC) పరీక్షల్లో ఉచిత శిక్షణకు ఎంపికైన నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు ఎస్సీ అభ్యర్థులకు కలెక్టర్ హిమాన్సు శుక్లా అధ్యాయన సామాగ్రితో కూడిన డిజిటల్ ట్యాబ్‌లను అందజేశారు. శుక్రవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో వీటిని అభ్యర్థులకు అందజేశారు. శిక్షణకు ఎంపికైన అభ్యర్థులను ఆయన అభినందించారు.