News December 12, 2025

ఫోర్ట్ వరంగల్‌కు చేరుకున్న ఒయాసిస్ జనని యాత్ర!

image

దేశవ్యాప్తంగా ఫెర్టిలిటీ అవగాహన పెంచే లక్ష్యంతో చేపట్టిన ఓయాసిస్ జనని యాత్ర వరంగల్‌కు చేరుకుంది. టైర్ I, ఈ, III ప్రాంతాల్లో ఫెర్టిలిటీ అవగాహన, నిపుణుల మార్గదర్శకం, ఫెర్టిలిటీ స్క్రీనింగ్ సేవలను నేరుగా ప్రజలకు అందించడమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యమని ఒయాసిస్ ప్రతినిధులు తెలిపారు. ఫోర్ట్ వరంగల్ తర్వాత ఈ జనని యాత్ర, రాష్ట్రంలో భూపాలపల్లి, జమ్మికుంట, మహబూబాబాద్ ప్రాంతాల్లో యాత్ర కొనసాగనుంది.

Similar News

News December 12, 2025

MHBD: ఈనెల 13న జవహార్ నవోదయ పరీక్ష!

image

జవహర్ నవోదయ విద్యాలయంలో 2026 విద్యా సంవత్సరానికి ఆరవ తరగతిలో ప్రవేశానికి ప్రవేశ పరీక్షను ఈనెల 13న నిర్వహిస్తున్నట్లు మామునూర్ జవహర్ నవోదయ ప్రిన్సిపల్ బి.పూర్ణిమ శుక్రవారం తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 28 సెంటర్లలో 5648 మంది పరీక్ష రాస్తున్నారన్నారు. ఉదయం 11:30 నుంచి మ.1:30 వరకు పరీక్ష జరుగుతుందని,
అడ్మిట్ కార్డ్ తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. https://navodaya.gov.in

News December 12, 2025

రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు ఉప్పలగుప్తం విద్యార్థుల ఎంపిక

image

ఉప్పలగుప్తం రాష్ట్ర స్థాయి అండర్-14 సాఫ్ట్ బాల్ పోటీలకు మండలం గొల్లవిల్లి ZP ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. పోటీలకు ఎంపికైన మల్లిపూడి అయ్యప్ప, సవరపు లక్ష్మిలను శుక్రవారం ఆ పాఠశాలలో HM కనకదుర్గ, పీడీలు గొలకోటి ఫణీంద్ర కుమార్, దూలం సరస్వతి, టి.సునీత, వి.విజయభాస్కర్, ఉపాధ్యాయులు అభినందించారు. విద్యార్థులు రాష్ట్రస్థాయిలో విజయం సాధించడం పట్ల స్కూల్‌కు మంచిపేరు తీసుకొచ్చారన్నారు.

News December 12, 2025

ఒంగోలు: పెళ్లి పేరుతో మోసం.. పదేళ్ల జైలుశిక్ష

image

పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి మోసం చేసిన కేసులో నిందితుడికి పదేళ్ల జైలుశిక్ష, రూ.12వేల జరిమానా విధిస్తూ ఒంగోలు 2వఅదనపు జిల్లా సెషన్స్ జడ్జి శుక్రవారం తీర్పునిచ్చారు. హెచ్ఎంపాడు మండలానికి చెందిన రవి ఓ యువతిని నమ్మించి మోసం చేసినట్లుగా 2018లో కేసు నమోదైంది. నేరం రుజువు కావడంతో రవికి శిక్ష విధిస్తూ జడ్జి తీర్పునిచ్చారు. సరైన సాక్ష్యాధారాలు ప్రవేశపెట్టిన పోలీసులను ఎస్పీ అభినందించారు.