News April 7, 2025
ఫ్యామిలీతో బైరెడ్డి!

వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి శ్రీరామనవమి వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. తల్లిదండ్రులు, సోదరులతో కలిసి దిగిన గ్రూప్ ఫొటోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. చాలా రోజుల తర్వాత బైరెడ్డి ఫ్యామిలీతో కనిపించడంతో అభిమానులు సూపర్ అంటూ కామెంట్ చేస్తున్నారు. కాగా ఇటీవల వైసీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యనిర్వహక అధ్యక్షుడిగా సిద్ధార్థ్ రెడ్డి నియమితులైన విషయం తెలిసిందే.
Similar News
News November 2, 2025
BREAKING: రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు

AP: రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్‌ల బదిలీలు, నియామకాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖ సిటీ డిప్యూటీ కమిషనర్‌గా మణికంఠ చందోలు, విజయవాడ సిటీ డిప్యూటీ కమిషనర్‌గా కృష్ణకాంత్ పటేల్, సైబర్ క్రైమ్ సీఐడీ ఎస్పీగా అదిరాజ్ సింగ్ రాణా, ఇంటెలిజెన్స్ ఎస్పీగా శ్రీనివాసరావు, ఏసీబీ జాయింట్ డైరెక్టర్‌గా ఈజీ అశోక్ కుమార్ తదితరులను బదిలీలు, నియామకాలు చేశారు.
News November 2, 2025
కొనసాగుతున్న కరీంనగర్ అర్బన్ ఎన్నికల కౌంటింగ్

కరీంనగర్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. అర్ధరాత్రి వరకు తుది ఫలితం వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 2 వరకు పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. 12 డైరెక్టర్ స్థానాలకు 54 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పటిష్ట భద్రతా మధ్య కౌంటింగ్ కొనసాగుతుంది. అధికారులు పారదర్శకంగా లెక్కింపు చేపడుతున్నారు.
News November 2, 2025
జానపద కళాకారుల సంక్షేమంపై కవిత హామీ

జానపద కళాకారుల సంక్షేమంపై కరీంనగర్‌లో జరిగిన ‘జాగృతి జనం బాట’ కార్యక్రమంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హామీ ఇచ్చారు. కళాకారులను ప్రభుత్వం గుర్తించి, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి వారికి వేతనాలు వచ్చేలా కృషి చేస్తామని తెలిపారు. జానపద సంప్రదాయాన్ని నిలబెట్టిన కళాకారులకు కళాభివందనం చేసిన కవిత, హక్కుల కోసం అందరూ కలిసి పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు.


