News November 6, 2025
‘ఫ్యాషన్ పెళ్లిళ్లు వద్దు’

ఉమ్మడి అనంత జిల్లాల ప్రభుత్వ ఖాజీలు గుంతకల్లు ప్రభుత్వ ఖాజీ కార్యాలయంలో బుధవారం కీలక సమావేశం నిర్వహించారు. సినిమా షూటింగ్‌లు, ఫొటో సెషన్‌ల ప్రదర్శనతో నిఖా పవిత్రత కోల్పోతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. నిఖా కేవలం ఇస్లామియా పద్ధతిలో సంప్రదాయంగా జరగాలన్నారు. ఫ్యాషన్ పెళ్లిళ్లకు దూరంగా ఉండాలని, సంప్రదాయ నిఖా విధానాల పునరుద్ధరణ చేయాలని అన్నారు. నిజమైన దైవబంధాన్ని అనుసరించాలని విజ్ఞప్తి చేశారు.
Similar News
News March 6, 2026
తెలంగాణకు కొత్త గవర్నర్

కేంద్రం పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్‌లను నియమించింది. తెలంగాణకు శివ ప్రతాప్ శుక్లాను అపాయింట్ చేసింది. ప్రస్తుతం ఆయన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ఉన్నారు. ఇక TG గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్రకు బదిలీ చేసింది. నాగాలాండ్ గవర్నర్‌గా నంద్ కిశోర్ యాదవ్, బిహార్ గవర్నర్‌గా సయ్యద్ హస్నేన్, బెంగాల్ గవర్నర్‌గా R.N. రవిని నియమించింది.
News March 6, 2026
చంద్రగిరి: మరో MBU విద్యార్థి సూసైడ్

చంద్రగిరి మోహన్ బాబు యునివర్సిటీ(MBU)లోని బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థి హర్షవర్ధన్ రెడ్డి రామిరెడ్డిపల్లిలోని ఒక ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు కడప జిల్లాకు చెందినవాడిగా గుర్తించారు. విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.
News March 6, 2026
ఇరాన్ సుప్రీంలీడర్‌ను నేనే ఎంపిక చేస్తా: ట్రంప్

ఇరాన్ సుప్రీంలీడర్ ఎన్నిక విషయంలో తాను ఇన్వాల్వ్ అవుతానని US అధ్యక్షుడు ట్రంప్ అన్నారు. ఖమేనీ కొడుకు మొజ్తబా సుప్రీంలీడర్ అయ్యే అవకాశం ఉందని, దీన్ని అంగీకరించబోమని స్పష్టంచేశారు. శాంతి, సామరస్యాన్ని తీసుకొచ్చే వ్యక్తిని కోరుకుంటున్నామని తెలిపారు. ‘వాళ్లు టైమ్ వేస్ట్ చేస్తున్నారు. ఖమేనీ కొడుకు ప్రభావం చూపలేడు. వెనిజులాలో డెల్సీని ఎంపిక చేసినట్లే ఇక్కడా నేను నియామకంలో పాల్గొనాలి’ అని చెప్పారు.


