News January 31, 2026

ఫ్యూచర్ ట్రేడింగ్.. వెండి రేటు రూ.1.28 లక్షలు డౌన్

image

కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా పెరిగిన గోల్డ్, సిల్వర్ రేట్లు క్రమంగా పతనమవుతున్నాయి. <<19006060>>ఫ్యూచర్ ట్రేడింగ్<<>>(మార్చి)లో కేజీ వెండి ధర ఏకంగా రూ.1,28,126 పడిపోయి రూ.2,91,922 పలికింది. అలాగే ఏప్రిల్‌కు సంబంధించి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.1,50,849కి పడిపోయింది. లైఫ్ టైమ్ హై(రూ.1,80,779)తో పోల్చితే రూ.29,930 తగ్గడం గమనార్హం.

Similar News

News February 14, 2026

వాలంటైన్స్ డే: మహీకాకు హార్దిక్ అదిరిపోయే గిఫ్ట్!

image

వాలంటైన్స్ డే సందర్భంగా హార్దిక్ పాండ్య తన కాబోయే భార్య మహీకా శర్మపై ఉన్న ప్రేమను చాటుతూ మెడపై ఒక ప్రత్యేకమైన టాటూ వేయించుకున్నారు. మొదట ‘M’ అనే అక్షరాన్ని మాత్రమే అనుకున్నా చివరికి రెండు చిరుతపులుల డిజైన్‌ను ఎంచుకున్నారు. ఒక చిరుత బలానికి చిహ్నంగా ఉంటే, రెండోది మహీకా అక్షరం ‘M’ రూపంలో ఆమె ఉనికిని సూచిస్తుంది. ఇద్దరూ వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ తమ రిలేషన్‌లో కలిసి ప్రయాణించాలన్నదే టాటూ అర్థం.

News February 14, 2026

గుడ్ కొలెస్ట్రాల్ పెరగాలంటే..

image

నేటి కాలంలో గుడ్ కొలెస్ట్రాల్ (HDL) తగ్గి బ్యాడ్ కొలెస్ట్రాల్ (LDL) పెరుగుతోంది. దీంతో గుండెపోటు ముప్పు పెరుగుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఒమేగా-3 ఉండే చేపలు, ఆలివ్ ఆయిల్, బాదం, వాల్‌నట్, బ్లూబెర్రీ, బీన్స్ తినాలని సూచిస్తున్నారు. షుగర్, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. వారానికి కనీసం 150 నిమిషాలు ఎక్సర్‌సైజ్ చేయాలి. స్మోకింగ్ మానేయాలి. రోజుకు 7-8 గం. నిద్రపోవాలి.

News February 14, 2026

పిల్లల్లో ఈటింగ్ డిజార్డర్

image

కొందరు పిల్లలు ఎంత తింటున్నారో తెలియకుండా తినేస్తుంటారు. దీన్నే ఈటింగ్ డిజార్డర్ అంటారు. దీనివల్ల పిల్లల్లో జుట్టు రాలడం, అతిగా కోపాన్ని ప్రదర్శించడం, నలుగురితో కలవకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లల ఆహారపు అలవాట్లను క్రమబద్ధం చేయడానికి కుటుంబం వారికి అండగా నిలవాలి. భయపెట్టడం, అలవాట్లను బలవంతంగా మార్చడానికి ప్రయత్నించకూడదు. మార్పు వచ్చే వరకు సహనంగా, మృదువుగా ప్రవర్తించాలి.