News December 7, 2024

ఫ్రాన్స్‌ యువతిని పెళ్లాడిన గొల్లపల్లి యువకుడు

image

శ్రీ సత్యసాయి జిల్లా యువకుడు ఫ్రాన్స్ యువతిని పెళ్లాడారు. గోరంట్ల మం. గొల్లపల్లికి చెందిన సందీప్ యాదవ్ ఫ్రాన్స్‌లోని సీఎన్ఆర్ యూనివర్సిటీలో సైంటిస్ట్‌గా పనిచేస్తున్నారు. అదే నగరంలో గూగుల్‌లో పనిచేస్తున్న అడ్‌సవిన్‌ అనే యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యులు ఒప్పుకోవడంతో హిందూపురం పరిధిలోని ఓ ఫంక్షన్ హాల్‌లో పెళ్లి చేసుకున్నారు.

Similar News

News October 21, 2025

‘రిజర్వేషన్ అమలులో మహా మోసం’

image

రిజర్వేషన్ల అమలులో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు మహా మోసం జరిగిందని రిజర్వేషన్ సాధికార సమితి అధ్యక్షుడు జీవీ ఉజ్వల్ ఆరోపించారు. అనంతపురంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డీఎస్సీ నియామకాలలో రిజర్వేషన్ కటాఫ్ కంటే ఓపెన్ కటాఫ్ తక్కువ ఉండటం విడ్డూరంగా ఉందన్నారు. జీవో 77లో ఓపెన్ క్యాటగిరీ పోస్టులు నింపిన తర్వాతే రిజర్వేషన్ పోస్టులు భర్తీ చేయాలనే నిబంధన స్పష్టంగా ఉందన్నారు.

News October 21, 2025

గంట వ్యవధిలోనే బాలుడి ఆచూకీ లభ్యం

image

అనంతపురంలోని హౌసింగ్ బోర్డులో రెండేళ్ల బాబు ఇంటి నుంచి బయటికి వచ్చి తప్పిపోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బ్లూ కోట్ పోలీసులు, ఓ కానిస్టేబుల్ ఆ బాలుడి ఆచూకీ కనుక్కున్నారు. వారి తల్లిదండ్రులకు అప్పజెప్పారు. గంట వ్యవధిలోనే బాలుడి ఆచూకీ కనుగొన్న పోలీసులకు ఎస్పీ అభినందించారు.

News October 20, 2025

ప్రభుత్వం డీఏ జీఓను సవరించాలి: విజయ్

image

ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు కరవు భత్యాన్ని మంజూరు చేస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ జారీచేసిన 60, 61 జీఓలు అసంబద్ధంగా ఉంటూ ఉద్యోగికి తీవ్ర నష్టం కలిగించేలా ఉన్నాయని, వెంటనే జీవోలను సవరించాలని ఏపీఎస్ఈఏ రాష్ట్ర అధ్యక్షుడు నల్లపల్లి విజయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. సోమవారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. డీఏ అరియర్స్ పదవీ విరమణ తర్వాత చెల్లిస్తామని అనడం సరైనది కాదన్నారు.