News December 22, 2025
ఫ్రెండ్స్, ఫ్యామిలీ.. ఎవరినైనా అద్దెకు తీసుకోవచ్చు

అమ్మ, నాన్న కావాలా? పెళ్లిలో సందడి చేసే స్నేహితులు కావాలా? జపాన్‌లో ఎవరినైనా అద్దెకు తీసుకోవచ్చు. అక్కడున్న ‘రెంట్ ఏ ఫ్యామిలీ’ సర్వీస్‌పై నెట్టింట చర్చ జరుగుతోంది. ఫంక్షన్లలో ఫ్రెండ్స్, ఫ్యామిలీగా నటించేందుకు నటీనటులు అందుబాటులో ఉంటారు. వీరు అచ్చం మీ సొంత మనుషుల్లాగే కలిసిపోయి, అంత్యక్రియల్లో ఏడుస్తారు.. పెళ్లిళ్లలో నవ్వుతూ ఫొటోలు దిగుతారు. ఒక్కొక్కరికి 10 వేల యెన్స్ వరకూ చెల్లించాల్సి ఉంటుంది.
Similar News
News December 25, 2025
GOVT శాఖల విద్యుత్ బకాయి ₹35,982 కోట్లు

TG: ప్రభుత్వ విభాగాల విద్యుత్ బిల్లుల బకాయిలు భారీగా పేరుకుపోయాయి. TGSPDCL, NPDCLలు నోటీసులు ఇస్తున్నా ఫలితం లేకపోతోంది. సాగునీటి శాఖ ₹22,926 కోట్లు, HYD వాటర్ బోర్డు ₹7,084 కోట్లు చెల్లించాలి. మిషన్ భగీరథ ప్రాజెక్టు విభాగం ₹5,972 కోట్లు కట్టాల్సి ఉంది. గత 5 ఏళ్లుగా బిల్లులు పెండింగ్ ఉన్నాయి. కాగా ఈ బకాయిల వసూలు బాధ్యతను కొత్తగా ఏర్పాటుచేసిన పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి ప్రభుత్వం అప్పగించింది.
News December 25, 2025
పిల్లలు త్వరగా పడుకోవాలంటే..

ప్రస్తుత కాలంలో చాలామంది పిల్లలు లేటుగా పడుకొని ఆలస్యంగా నిద్ర లేస్తున్నారు. ఇలా కాకుండా ఉండాలంటే పిల్లలు ప్రతిరోజు ఒకే వేళకు నిద్రపోయేలా, ఒకే సమయానికి లేచేలా చూడాలి. దాంతో చక్కగా నిద్రపట్టి మెదడు చురుకుగా పనిచేస్తుంది. రాత్రిళ్లు పిల్లలు ఫోన్, టీవీ చూడకుండా వారికి ఆసక్తి కలిగించే కథలు చెప్పాలి. దీంతో త్వరగా నిద్రపోతారు. పిల్లలను నిద్రపుచ్చే సమయానికి గది వాతావరణం ప్రశాంతంగా ఉండేలా చూడాలి.
News December 25, 2025
భీమవరం డీఎస్పీ బదిలీ

AP: భీమవరం డీఎస్పీ <<18073175>>జయసూర్యను<<>> డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా బదిలీ చేశారు. ఆయన స్థానంలో కొత్త డీఎస్పీగా రఘువీర్ విష్ణును నియమించారు. జయసూర్యపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, వాటిపై విచారణ చేయాలని అక్టోబర్‌లో డిప్యూటీ సీఎం పవన్ డీజీపీకి లేఖ రాశారు. ఆయన పేకాట నిర్వహణకు సహకరిస్తున్నారని పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే జయసూర్య మంచి అధికారంటూ డిప్యూటీ స్పీకర్ రఘురామ అప్పట్లో కితాబిచ్చారు.


