News July 4, 2025
ఫ్లడ్ యాక్షన్ ప్రణాళిక సిద్ధం చేయాలి: కలెక్టర్ రాహుల్ శర్మ

జిల్లాలో వరదలు ఎప్పుడు సంభవించిన ప్రజలకు ఎలాంటి హాని జరగకుండా ఆదుకునేందుకు మండలాల వారీగా ఫ్లడ్ యాక్షన్ ప్రణాళిక తయారు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. గ్రామాలు, మండలాల వారీగా వరద సహాయక చర్యలపై కార్యాచరణ ప్రణాళికలు తయారు చేయాలని, ముంపు గ్రామాలు, పునరావాస కేంద్రాల ఏర్పాటుపై తహశీల్దార్లను అడిగి తెలుసుకున్నారు.
Similar News
News July 5, 2025
శుభ సమయం (05-07-2025) శనివారం

✒ తిథి: శుక్ల దశమి సా.6.20 వరకు తదుపరి ఏకాదశి
✒ నక్షత్రం: స్వాతి రా.8.00 వరకు తదుపరి విశాఖ
✒ శుభ సమయం: ఉ.10.30-మ.12.00 వరకు, మళ్లీ సా.5.39-6.27 వరకు
✒ రాహుకాలం: ఉ.9.00-10.30
✒ యమగండం: మ.1.30-3.00
✒ దుర్ముహూర్తం: ఉ.6.00-7.36
✒ వర్జ్యం: రా.2.13-3.59
✒ అమృత ఘడియలు: ఉ.10.16-మ.12.02
News July 5, 2025
20 బైకులను ప్రారంభించిన నెల్లూరు SP

జిల్లాలో రాత్రిళ్లు నిఘాను మరింత పెంచేందుకు చర్యలు చేపట్టినట్లు SP కృష్ణ కాంత్ తెలిపారు. ఇందులో భాంగంగా 20 బైకులను ఆయన శుక్రవారం ప్రారంభించారు. పగలు, రాత్రిళ్లు గస్తీకి వీటిని వాడనున్నట్లు స్పష్టం చేశారు. నెల్లూరు ట్రాఫిక్, నెల్లూరు టౌన్, రూరల్, ఆత్మకూరు, కావలి, కందుకూరు సబ్ డివిజన్‌లకు వాటిని కేటాయించినట్లు తెలిపారు.
News July 5, 2025
SPMVV: ప్రాజెక్టు ఫెలోషిప్‌కు దరఖాస్తుల ఆహ్వానం

శ్రీ పద్మావతి మహిళా యూనివర్సిటీలో కాంట్రాక్ట్ ప్రాతిపదికగా ప్రాజెక్టు ఫెలోషిప్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వర్సిటీ కార్యాలయం పేర్కొంది. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సైన్స్, మూడేళ్ల డిప్లొమా పూర్తి చేసిన మహిళా అభ్యర్థులు అర్హులని తెలిపింది. ఇతర వివరాలకు https://www.spmvv.ac.in/ వెబ్ సైట్ చూడాలని సూచించింది.దరఖాస్తులకు చివరి తేదీ జూలై 14.