News January 9, 2026
ఫ్లెమింగో ఫెస్టివల్‌కు రానున్న CM

సూళ్లూరుపేట ఫ్లెమింగో ఫెస్టివల్‌కు CM చంద్రబాబు రానున్నారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టర్ వెంకటేశ్వర్, MLA విజయశ్రీ ఏర్పాట్లు పరిశీలించారు. మరోవైపు వేడుకలు మూడు రోజులు జరగనున్నట్లు తెలుస్తోంది. ఇది వరకు 10, 11వ తేదీల్లోనే వేడుకలకు ఏర్పాట్లు చేయగా.. తాజాగా మరో రోజు అదనంగా కొనసాగనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Similar News
News February 11, 2026
NRPT: మద్దూరులో అత్యధికంగా పోలింగ్ శాతం నమోదు

నారాయణపేట జిల్లాలోని నాలుగు మున్సిపాల్టీల పరిధిలో పోలింగ్ ముగిసే సమయానికి మొత్తం 72.87 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మున్సిపాల్టీల వారిగా నమోదైన పోలింగ్ శాతం వివరాలు..
నారాయణపేటలో 74.18 శాతం, కోస్గి 74.83%, మక్తల్ 65.83%, మద్దూరు 79.0 శాతం పోలింగ్ నమోదైంది. మద్దూరు మున్సిపాల్టీ పరిధిలో అత్యధికంగా 79.0 శాతం పోలింగ్ నమోదైంది.
News February 11, 2026
NRPT: ముగిసిన పోలింగ్.. శుక్రవారమే ఫలితాలు

నారాయణపేట మున్సిపాలిటీలోని 24 వార్డులకు బుధవారం జరిగిన ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 34,460 ఓట్లకు గాను 22,938 ఓట్లు పోలయ్యాయి. అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారు, మున్సిపల్ ఛైర్మన్ పీఠం ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ నెలకొంది. తుది ఫలితాలు ఫిబ్రవరి 13న (శుక్రవారం) వెలువడనున్నాయి.
News February 11, 2026
భూపాలపల్లి: 65.18 శాతం పోలింగ్ @5PM

భూపాలపల్లి మున్సిపాల్టీలో సాయంత్రం 5 గంటలకు 65.18 శాతం పోలింగ్ నమోదయింది. మున్సిపాలిటీలోని 30 వార్డులు, 86 పోలింగ్ కేంద్రాల్లో 34,367 ఓట్లు పోలయ్యాయి. మున్సిపాలిటీలో 52,826 మంది ఓటర్లు ఉన్నారు. 17,253 మంది పురుషులు, 17,111 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ కేంద్రాలలో ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులను ఎన్నికల సిబ్బంది సీజ్ చేశారు.


