News January 10, 2026

ఫ్లెమింగో ఫెస్టివల్‌.. నేలపట్టును చూసేయండి!

image

దొరవారిసత్రం(M)లోని నేలపట్టు పక్షుల అభయారణ్యం సూమారు 458.92 హెక్టార్ల విస్తీర్ణంలో ఉంది. వలస పక్షులు ఏటా అక్టోబర్ నుంచి మార్చి వరకు ఇక్కడే గుడ్లను పొదిగి పిల్లలు పెద్దవి అయ్యాక స్వస్థలాలకు వెళ్లిపోతాయి. ఈ పక్షులు పులికాట్ సరస్సులో వేట ముగించుకుని సాయంత్రం నేలపట్టు వద్ద కలపచెట్లపై సేదతీరుతాయి. వీటిని చూసేందుకు బైనాక్యులర్లను ఉంచారు. నేలపట్టు గురించి వీడియో ప్రదర్శన, స్నేక్ షో ఏర్పాటు చేశారు.

Similar News

News February 4, 2026

మనుబోలులో విజిలెన్స్ దాడులు.. రూ.కోటి సరుకు స్వాధీనం

image

మనుబోలులోని పెట్రోల్ బంక్ సమీపంలో జ్యన్తి మల్టీ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్‌పై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. ఎటువంటి బిల్లులు లేకుండా అక్రమంగా ఇండస్త్రిరియల్ ఆయిల్‌ను డీజిల్‌గా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ తనిఖీల్లో బిల్లులు లేకుండా ఇతర రాష్ట్రాల నుంచి ఆయిల్ తీసుకొచ్చి అమ్ముతున్నారన్నారు. రూ.లక్షా పదివేల లీటర్ల ఆయిల్‌ను, అయిదు ట్యాంకర్లను సీజ్ చేశారు.

News February 3, 2026

తిరుపతిలో మెహన్ బాబు, విష్ణుపై కేసులు

image

తిరుపతిలో విద్యార్థి సంఘాల <<19040348>>కిడ్నాప్<<>> వ్యవహారంలో మోహన్ బాబు, మంచు విష్ణు, MBU PRO సతీశ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. సతీశ్‌ను పోలీసులు రేణిగుంట ఎయిర్ పోర్ట్‌లో అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కాగా వీరిపై తిరుచానూరు PSలో కేసు నమోదు అయింది.

News February 3, 2026

BREAKING.. కాకాణికి నోటీసులు

image

మాజీ మంత్రి, వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డికి పోలీసు అధికారులు నోటీసులు ఇచ్చారు. చంద్రబాబు, సోమిరెడ్డిపై కాకాణి గోవర్ధన్ రెడ్డి దుర్బషలాడారని టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. దీనిపై నెల్లూరు రూరల్, పొదలకూరు, మనుబోలులో కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆయన ఇంటికి వెళ్లి పోలీసులు నోటీసులు అందజేశారు.