News January 12, 2026

ఫ్లెమింగో ఫెస్ట్: ఈ మాత్రం చాలునా.. ఇంకా కొంచెం పెంచనా.!

image

ఫ్లెమింగో ఫెస్టివల్‌లో రెండో రోజు సాంస్కృతిక కార్యక్రమాలు ముగిశాయి. హీరోయిన్‌లు ఆషికా, డింపుల్ అందాలు, హెబ్బా డాన్స్ ఫర్మామెన్స్‌ అదిరిపోయింది. సింగర్ హారిక పాటలకు ప్రేక్షకులు తెగ సందడి చేశారు. జదర్దస్త్ కమెడీయన్‌లు రాకేష్ దంపతులు, చంటి అలరించారు. మొత్తంగా రెండో రోజు కార్యక్రమాలు ‘ఈమాత్రం చాలునా.. ఇంకా కొంచెం పెంచనా’ అన్నట్లు సాగాయి. మీరూ ఈవెంట్‌కు వెళ్లింటే ఎలా ఉందో కామెంట్ చేయండి.

Similar News

News February 6, 2026

నాలుగు సీజన్లు.. ఇద్దరే విజేతలు

image

WPLలో ముంబై, ఆర్సీబీ జట్లదే డామినేషన్ కొనసాగుతోంది. ఇప్పటివరకు జరిగిన 4 సీజన్లలో ఈ రెండు జట్లే రెండేసి సార్లు విజేతలుగా నిలిచాయి. హర్మన్, స్మృతి సేనలు డామినేషన్‌తో ఇతర జట్లకు ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వట్లేదు. 2023, 2025లో ముంబై, 2024, 2026లో RCB విజేతలుగా నిలిచాయి. అటు ఢిల్లీ 4 సార్లు ఫైనల్ చేరిన టైటిల్‌ను గెలవలేకపోయింది. గుజరాత్ జెయింట్స్, యూపీకి ట్రోఫీ ఇంకా అందని ద్రాక్షగానే మిగిలింది.

News February 6, 2026

ఇంకా చూడాల్సింది.. జయించాల్సింది చాలా ఉంది మిత్రమా!

image

సాఫ్ట్‌వేర్ రంగంలో పెరుగుతున్న పని ఒత్తిడి, ఉద్యోగ భద్రత లేకపోవడంతో ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడటం ఆందోళన కలిగిస్తోంది. ఏ సమస్యకైనా సూసైడ్ పరిష్కారం కాదని, పోరాడి సాధించాల్సింది ఎంతో ఉందని అంతా గుర్తుంచుకోవాలి. కొత్త స్కిల్స్ నేర్చుకోవడంపై ఫోకస్ చేయాలి. కంపెనీలు కూడా ఉద్యోగుల మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సైకాలజిస్టులను నియమించుకోవాలి. దీనిపై మీరేమంటారు?

News February 6, 2026

కశ్మీర్ మా దేశంలో భాగమవుతుంది: పాక్ ప్రధాని

image

కశ్మీర్ తమ దేశంలో అంతర్భాగమవుతుందని పాక్ PM షరీఫ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘కశ్మీర్ ప్రజల ఆకాంక్షలను గౌరవించడం, UNSC తీర్మానాలు అమలు చేయడమే J&K వివాదానికి సరైన పరిష్కారం. కశ్మీర్‌ ప్రజలకు సంఘీభావం తెలియజేస్తున్నా’ అని కశ్మీర్ సంఘీభావ దినోత్సవం సందర్భంగా POK అసెంబ్లీలో అన్నారు. గతేడాది జరిగిన ఘర్షణల తర్వాత కశ్మీర్ వివాదం మళ్లీ రాజుకుందని చెప్పారు. ఇండియా ప్రాక్సీ టెర్రర్‌ను ఎగదోస్తోందని ఆరోపించారు.