News December 11, 2025
ఫ్లైట్ జర్నీలో సమస్యలుంటే ఇలా చేయండి

ఇండిగో సేవలు సాధారణస్థితికి వచ్చినా కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. ‘ప్రయాణికుల కంప్లైంట్స్ రియల్ టైమ్ పరిష్కారం కోసం క్రమం తప్పకుండా నిఘా ఉంచుతున్నాం. ఏదైనా సమస్య ఉంటే Xలో @MoCA_GoIని ట్యాగ్ చేయండి. కంట్రోల్ రూమ్‌ను 011-24604283/011-24632987 నంబర్‌లలో సంప్రదించండి. AirSewa యాప్/వెబ్ పోర్టల్‌లోనూ ఫిర్యాదు చేయొచ్చు’ అని ట్వీట్ చేశారు.
Similar News
News December 20, 2025
పర్యాటక రంగ అభివృద్ధిపై కలెక్టర్ సమావేశం

భద్రాద్రి జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధి, ప్రచార కార్యక్రమాలపై చర్చించేందుకు జిల్లాలోని టూరిజం సంబంధిత సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లతో కలెక్టర్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3గంటలకు కలెక్టరేట్లో సమావేశం జరుగుతుందన్నారు. టూరిజం రంగానికి సంబంధించిన సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, ఆసక్తి గల వారు హాజరు అవ్వాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ కోరారు.
News December 20, 2025
ప్రియుడితో గదిలో యువతి.. తండ్రి రావడంతో..

TG: సంగారెడ్డి(D) కొల్లూరులో విషాదం చోటు చేసుకుంది. HYD పాతబస్తీకి చెందిన వ్యక్తికి కొల్లూరులో డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరవగా ఖాళీగా ఉంటోంది. నిన్న ఆయన కూతురు(20), ప్రియుడితో కలిసి అక్కడి ఇంటికి వెళ్లింది. అదే సమయంలో ఆమె తండ్రి కూడా అక్కడికి వచ్చారు. దీంతో తీవ్రంగా భయపడ్డ ప్రేమ జంట బాల్కనీ నుంచి పక్క ఫ్లాట్‌కి వెళ్లాలని ప్రయత్నించింది. యువతి కాలు జారి 8వ అంతస్తు నుంచి పడి మరణించింది.
News December 20, 2025
PCOSలో ఎన్ని రకాలున్నాయో తెలుసా?

ప్రస్తుతకాలంలో చాలామందిలో PCOS సమస్య కనిపిస్తోంది. అయితే ఇందులో A, B, C, D అని 4 రకాలున్నాయంటున్నారు నిపుణులు. A రకంలో మగ హార్మోన్లు ఎక్కువగా ఉండటం, అండం విడుదల కాకపోవటం, అండాశయాల్లో తిత్తులు ఉంటాయి. Bలో మగ హార్మోన్లు ఎక్కువగా ఉండటం, నెలసరి అస్తవ్యస్తమవటం ఉంటాయి. Cలో- మగ హార్మోన్లు, తిత్తులూ ఉంటాయి. కానీ నెలసరి అవుతుంది. Dలో నెలసరి రాకపోవడం , తిత్తులు ఉన్నప్పటికీ మగ హార్మోన్లు ఎక్కువగా ఉండవు.


