News February 10, 2025

ఫ్లైట్ డోర్ తెరిచిన రాజమండ్రి ప్రయాణికుడు

image

విమానం ఎమర్జెన్సీ డోర్ తెరిచిన ప్రయాణికుడిపై కోరుకొండ పోలీసులు ఆదివారం రాత్రి కేసు నమోదు చేశారు. ఎస్ఐ శ్యామ్ సుందర్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి ఇండిగో విమానం శనివారం రాత్రి మధురపూడి విమానాశ్రయానికి వచ్చింది. ల్యాండ్ అయిన తరువాత రాజమండ్రికి చెందిన ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరిచాడు. దీంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. దీంతో విమానం వెళ్లడానికి జాప్యం జరిగింది.

Similar News

News February 11, 2025

రాజమండ్రిలో మైనర్ బాలిక మిస్సింగ్..కేసు నమోదు

image

రాజమండ్రిలో మైనర్ బాలిక అదృశ్యమైంది. స్థానిక సంజీవనగర్‌కు చెందిన సిద్దాబత్తుల లక్ష్మీ ప్రసన్న(17) కనిపించడం లేదంటూ త్రీ టౌన్ పోలీసులకు ఆమె తల్లి నాగలక్ష్మి సోమవారం రాత్రి ఫిర్యాదు చేసింది. స్థానిక ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ చదువుతున్న బాలికను చదువు మాన్పించారు. 8వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. త్రీ టౌన్ సీఐ సూర్య అప్పారావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

News February 11, 2025

RJY: జిల్లాలో 94.8 శాతం ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ

image

తూ.గో జిల్లాలో 4,30,339 పిల్లలకు గాను 4,07,961 మంది పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు పంపణీ 94.8శాతం మేర పూర్తి చేశామని కలెక్టర్ ప్రశాంతి సోమవారం సాయంత్రం తెలిపారు. 17వ తేదీన మరో దఫా అందిస్తామన్నారు. పిల్లలో రక్తహీనత నిర్మూలనే లక్ష్యంగా దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రతి 6 నెలలకు ఒకసారి నులి పురుగుల నివారణకు అల్బెండజోల్ మాత్రలను విద్యార్థులచే మింగిస్తుందని తెలిపారు. 

News February 10, 2025

రాజమండ్రి: బ్రిడ్జిపై రెండు కార్లు ఢీ.. ట్రాఫిక్ జామ్

image

రాజమండ్రి రోడ్ కం రైల్వే బ్రిడ్జిపై రెండు కార్లు ఢీ కొట్టడంతో ట్రాఫిక్ స్తంభించింది. ఈ ఘటనలో సుమారు రెండు గంటలు పాటు బ్రిడ్జిపై రాకపోకలు నిలిచిపోయాయి. వాహనాలు బ్రిడ్జిపై నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కాలేదని ప్రయాణీకులంతా సురక్షితంగా ఉన్నారని పోలీసులు తెలిపారు. సిబ్బంది సకాలంలో చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.

error: Content is protected !!