News January 29, 2026

‘బంగారంతో బీ కేర్‌ఫుల్’ వార్తల్లో నిజం లేదు: సజ్జనార్

image

TG: బంగారం ధరలు పెరగడంతో చైన్ స్నాచింగ్‌లు పెరిగిపోయాయని, అంతర్రాష్ట్ర ముఠాలు హైదరాబాద్‌లో మకాం వేశాయని SMలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని CP సజ్జనార్ తెలిపారు. అలాంటి పోస్టులను షేర్ చేయొద్దని సూచించారు. అసత్య ప్రచారాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్ పూర్తిగా సురక్షితమని హామీ ఇచ్చారు. అనుమానం వస్తే 100కు కాల్ చేసి శాంతి భద్రతల పరిరక్షణలో సహకరించాలని కోరారు.

Similar News

News February 12, 2026

విచారణకు రావాలని కాకాణికి నోటీసులు

image

AP: YCP నేత కాకాణి గోవర్ధన్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీచేశారు. నెల్లూరు జిల్లా కోవూరులోని గుమ్మలళ్లదిబ్బలో గంజాయి బ్యాచు చేతిలో అఘాయిత్యానికి గురై మరణించిన బాలిక కుటుంబాన్ని పరామర్శించిన సందర్భంలో చేసిన వ్యాఖ్యలపై గతంలో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఈనెల 14న విచారణకు రావాలని ఆయనకు నోటీసులు ఇచ్చినట్లు వైసీపీ Xలో పేర్కొంది. ప్రశ్నించడమే నేరమన్నట్లుగా పరిస్థితి ఉందని విమర్శించింది.

News February 12, 2026

52 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

image

ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ 52 పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి ఇంటర్, BSc, MSc(ఫారెస్ట్రీ, అగ్రోఫారెస్ట్రీ, బోటనీ, బయోటెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్), PhD అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. Sr. ప్రాజెక్ట్ అసోసియేట్‌కు FEB 19న, JPF, JRFకు FEB 20న, ప్రాజెక్ట్ అసిస్టెంట్‌కు FEB 23న, ఫీల్డ్ అసిస్టెంట్‌కు FEB 24న ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://fri.icfre.gov.in

News February 12, 2026

అతిగా ఆలోచిస్తున్నారా?

image

సాధారణంగా రాత్రుళ్లు మెదడులో తార్కికంగా పనిచేసే భాగం విశ్రాంతిలోకి వెళుతుంది. దీంతో భావోద్వేగాలు మన ఆలోచనలపై ప్రభావం చూపుతాయి. కాబట్టి, భవిష్యత్‌ గురించి ఆలోచించడానికి అది సరైన సమయం కాదు. ఏదైనా పనిచేశాక ఫలితాన్ని దానికే వదిలెయ్యాలి. వరుస వైఫల్యాలు ఎదురవుతోంటే మనసు గాయపడి ప్రతికూల ఆలోచనలు రావొచ్చు. కానీ వాటిని పక్కనపెట్టి తప్పిదాల నుంచి నేర్చుకున్న పాఠాలతో ఎలా విజయం సాధించవచ్చని ఆలోచించండి.