News January 26, 2025

బంగారుపాలె: లోయలోకి దూసుకెళ్లిన లారీ  

image

బంగారుపాలెం మండలం మొగిలి ఘాట్ వద్ద కాసేపటి క్రితం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కంటైనర్ అదుపుతప్పి లోయలోకి దూసుకుపోవడంతో ఒకరు మృతి చెందారు. బెంగళూర్ నుంచి చిత్తూరు వైపు వస్తున్న కంటైనర్ అతివేగంగా రావడంతో అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందగా డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

Similar News

News January 8, 2026

చిత్తూరు: ఈ నెల 10న స్కూళ్లకు హాలిడే.!

image

జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు ఈనెల 10న రెండో శనివారం సెలవుగా ప్రకటించినట్లు DEO రాజేంద్రప్రసాద్ తెలిపారు. గతంలో ఆ రోజును ప్రత్యామ్నాయ పాఠశాల దినంగా గుర్తించి పనిచేయాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. కానీ ప్రభుత్వం 10న సంక్రాంతి సెలవు మంజూరు చేయడంతో పాఠశాలలు పనిచేయాల్సిన అవసరం లేదన్నారు. ఆ రోజుకు ప్రత్యామ్నాయంగా పనిచేయాల్సిన తేదీని మళ్లీ ప్రకటిస్తామన్నారు.

News January 8, 2026

చిత్తూరు: హంతకుడు నేషనల్ క్రికెటర్ గణేశేనా.?

image

ఆయన వికలాంగుడు.. <<17815171>>దేశానికి<<>> ఆడుతుంటే అందరూ శభాష్ అన్నారు. విజయం ఇచ్చిన <<18790831>>గర్వమో<<>>, మానవత్వం మరిచాడో ప్రేయసిని చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. SRపురానికి చెందిన క్రికెటర్ గణేశ్ కవితను చంపి నీవా నదిలో పడేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె కూడా వికలాంగురాలు. వీరి మధ్య ఇది వరకే పెళ్లి ప్రస్తావనపై గొడవలు జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు.

News January 8, 2026

పుంగనూరు: 2042 వరకు అనుమతులు ఉన్నా.?

image

సదుంలో క్వారీపై వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్‌కు చెందిన ఐతేశ్వర్ణ్‌కు 2022 OCT 21న క్వారీకి అనుమతులు మంజూరయ్యాయి. సర్వే నంబర్‌ 270/2లోని సుమారు 4 హెక్టార్ల విస్తీర్ణంలో రంగు గ్రానైట్‌ రాళ్ల తవ్వకాలను ప్రారంభించారు. ఈ క్వారీకి 2042 OCT 20 వరకు అనుమతులు ఉన్నాయి. గ్రామస్థులు, క్వారీ యజమానులు మధ్య పంచాయితీ PS వరకు వెళ్లింది. గ్రామస్థులు కావాలనే అడ్డుకుంటున్నారనే వివాదం నడుస్తోంది.