News July 10, 2025
బంగారు కుటుంబాలను దత్తత తీసుకునే మార్గదర్శిలను గుర్తించాలి: కలెక్టర్

జిల్లాలో గుర్తించిన బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేందుకు మార్గదర్శిల ఎంపిక ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ రాజకుమారి ఆదేశించారు. జిల్లాలో వివిధ రంగాలలో సంపద సృష్టించేందుకు అనేక వనరులు ఉన్నాయన్నారు. వీటిని వినియోగించుకొని సంపద సృష్టించే ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. నియోజకవర్గాల స్పెషల్ ఆఫీసర్లు వారి ప్రాంతంలో ఉండే వనరులు ఎలా సంపాద సృష్టించాలనే అంశంపై వివరించారు.
Similar News
News July 11, 2025
బిజినెస్ అప్‌డేట్స్

*హిందుస్థాన్ యునిలీవర్ లిమిటెడ్ (HUL) కొత్త సీఈవో, ఎండీగా ప్రియా నాయర్ నియామకం
*LICలో మరోసారి వాటాలు విక్రయించేందుకు కేంద్రం ప్రయత్నాలు
*వేతనాల పెంపుపై నిర్ణయం తీసుకోలేదన్న TCS
*కెనడా దిగుమతులపై 35 శాతం టారిఫ్స్ విధించిన ట్రంప్, ఆగస్టు 1 నుంచి అమలు
News July 11, 2025
ఉమ్మడి విశాఖలో పొలిటికల్ హీట్

ఉమ్మడి విశాఖలో పొలిటికల్ హీట్ రాజుకుంది. జడ్పీ ఛైర్పపర్సన్ సుభద్ర పనితీరుపై అసంతృప్తితో ఉన్న 22 మంది ఆమెపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయం అధిష్టానం దృష్టికి వెళ్లడంతో చక్కదిద్దే ప్రయత్నాలు ప్రారంభించారు. అసంతృప్తిలో ఉన్న ZPTCలతో బొత్స సత్యనారాయణ విశాఖ క్యాంప్ ఆఫీసులో నేడు సమావేశం కానున్నారు. వారిని బుజ్జగించేందుకే ఈ సమావేశం జరుగుతున్నట్లు సమాచారం.
News July 11, 2025
కైలాసగిరిపై ‘లూజ్ గ్రావిటీ రైడ్’

కైలాసగిరిపై ‘లూజ్ గ్రావిటీ రైడ్’ని ప్రవేశపెట్టాలని V.M.R.D.A. నిర్ణయించింది. సింగపూర్‌లోని సెంటోసా వద్ద ఈ రైడ్ అత్యంత ప్రజాదరణ పొందింది. గురుత్వాకర్షణ ఆధారంగా ఈ వినోదాత్మక రైడ్ ఉంటుంది. అన్ని వయస్సుల వారు ఈ రైడ్‌ను ఆస్వాదించవచ్చని ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ తెలిపారు. కైలాసగిరిపై ఇది మంచి టూరిస్టు ఆకర్షణ అవుతుందని భావిస్తున్నామని ఎంసీ విశ్వనాథన్ తెలిపారు.