News August 14, 2024
బంగ్లాదేశ్‌లో దాడులను నిరసిస్తూ నేడు నిజామాబాద్ నగర బంద్

బంగ్లాదేశ్‌లో హిందూ ఆడబిడ్డలపైన, హిందూ దేవాలయాలపైన జరుగుతున్న మారణకాండకు నిరసనగా బుధవారం నిజామాబాద్ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు వివిధ హిందూ సంఘాల నాయకులు ప్రకటించారు. ఈ మేరకు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ.. నగరంలో ఉన్న వివిధ మర్చంట్ సంఘాల నాయకులు, విద్యాసంస్థలు, సినిమా థియేటర్ యాజమాన్యాలు అందరూ స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించాలని కోరారు.
Similar News
News February 9, 2026
NZB: రంజాన్ ఉపవాస దీక్షలకు అన్ని సౌకర్యాలు కల్పించాలి: Adtl. కలెక్టర్

రంజాన్ మాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని అదనపు కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. తన ఛాంబర్‌లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వమించారు. రంజాన్ ఉపవాస దీక్షలకు చేపట్టాల్సిన ఏర్పాట్లు, కల్పించాల్సిన సౌకర్యాలపై సమీక్ష జరిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లో సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు.
News February 9, 2026
NZB: జనసేన బోణీ కొడుతుందా.. యూటర్న్ తీసుకుంటుందా?

నిజామాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో దిగిన జనసేన ఇక్కడ బోణీ కొడుతుందా? లేక యూ టర్న్ తీసుకుంటుందా? అన్న చర్చ జరుగుతోంది. నగరంలోని 11 డివిజన్లలో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇటీవల జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ వారికి మద్దతుగా ప్రచారానికి వస్తారని అనుకున్నా అది క్యాన్సిల్ అయ్యింది. ఈ క్రమంలో పోటీ చేస్తున్న వారు Uటర్న్ తీసుకుని బీజేపీకి మద్దతు పలుకుతారా? లేక బరిలో ఉంటారా? అనేది చూడాల్సిందే.
News February 9, 2026
అశోక్ సాగర్ చెరువులో మహిళ మృతదేహం

ఎడపల్లి మండలం జానకంపేట శివారులో అశోక్ సాగర్ చెరువులో ఆదివారం సాయంత్రం గుర్తు తెలియని మహిళా మృతదేహం లభ్యమైన విషయం తెసిందే. ఐతే మృతదేహం ఆచూకీ లభ్యమైనట్లు ఎస్సై ముత్యాల రమ తెలిపారు. మృతురాలు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పులాంగ్, కమ్యూనిటీ హాల్ ప్రాంతానికి చెందిన అష్రఫ్ బేగం(60)గా గుర్తించినట్లు చెప్పారు.


