News January 7, 2026

బంగ్లాదేశ్‌లో మరో హిందువు.. మూక దాడి నుంచి తప్పించుకోలేక..

image

బంగ్లాదేశ్‌లో మరో హిందువు బలయ్యాడు. నవ్‌గావ్‌లోని మహాదేవ్‌పూర్‌లో దొంగతనం చేశాడంటూ మిథున్ సర్కార్‌(25)ను మూక వెంటాడింది. దీంతో తప్పించుకునే దారి లేక, ప్రాణాలను కాపాడుకునేందుకు అతడు కాలువలోకి దూకాడు. ఈత రాక నీట మునిగి చనిపోయాడు. సాయం కోసం అర్థించినా ఎవరూ కనికరించలేదు. ఇటీవల హిందువులపై ఇలాంటి <<18775269>>ఘటనలు<<>> జరుగుతూనే ఉన్నాయి.

Similar News

News February 15, 2026

‘జన నాయగన్’ ఇప్పట్లో లేనట్లే..

image

దళపతి విజయ్ ఆఖరి సినిమా ‘జన నాయగన్’ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్‌కు మరో షాకింగ్ న్యూస్. సెన్సార్ బోర్డు నుంచి క్లియరెన్స్ రాకపోవడంతో ఇప్పటికే సంక్రాంతి రేసు నుంచి తప్పుకొన్న ఈ మూవీ ఇప్పుడు ఏప్రిల్ వరకు వచ్చే అవకాశం లేదని తేలిపోయింది. కెనడా డిస్ట్రిబ్యూటర్ ‘యార్క్ సినిమాస్’ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. 2026 ఏప్రిల్ 30కి ముందు ఈ చిత్రం రిలీజ్ అయ్యే ఛాన్స్ లేదని తేల్చి చెప్పింది.

News February 15, 2026

ఇవాళ ఓడితే నేపాల్, నమీబియా ఇంటికే?

image

ఇవాళ WCలో భారత్ vs పాక్‌తో పాటు మరో 2 మ్యాచులు జరగనున్నాయి. ఉ.11 గంటలకు వెస్టిండీస్, నేపాల్ తలపడనున్నాయి. ఇప్పటివరకు నేపాల్ 2 మ్యాచులు ఆడగా రెండింట్లోనూ ఓడింది. ఇవాళా ఓడిపోతే ఆ జట్టు దాదాపుగా ఎలిమినేట్ అయినట్లే. ఇక మ.3 గం.కు నమీబియా, USA మ్యాచ్ జరగనుంది. ఇప్పటివరకు USA 3 మ్యాచుల్లో ఒకటి గెలిచింది. అటు నమీబియా రెండింట్లోనూ ఓటమిపాలైంది. ఇవాళ కూడా నమీబియా ఓడితే దాదాపుగా ఇంటిదారి పట్టినట్లే.

News February 15, 2026

ESIC వారణాసిలో 51 పోస్టులకు నోటిఫికేషన్

image

ESIC వారణాసి 51పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత గలవారు FEB 24 వరకు అప్లై చేసుకోవచ్చు. ఫిబ్రవరి 25, 26 తేదీల్లో ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో MD/MS అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. ప్రొఫెసర్‌కు నెలకు రూ.1,23,100, అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.78,800,అసిస్టెంట్ ప్రొఫెసర్‌, సీనియర్ రెసిడెంట్‌కు రూ.67,700, ఇతర అలవెన్సులు చెల్లిస్తారు. సైట్: esic.gov.in