News January 23, 2026
‘బంగ్లాదేశ్ కథ ముగిసినట్లే’.. నిరాశలో క్రికెటర్లు

T20 WC నుంచి BAN వైదొలగడంపై ఆ దేశానికి చెందిన పలువురు క్రికెటర్లు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని మండిపడుతున్నారు. T20 కెప్టెన్ లిటన్ దాస్, టెస్ట్ కెప్టెన్ షాంటో టోర్నీలో ఆడేందుకు సిద్ధమని చెప్పినా, వారి మాటకు విలువ ఇవ్వలేదని సమాచారం. ‘బంగ్లా క్రికెట్ ముగిసినట్లే’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News February 11, 2026
1pm వరకు 48.54% పోలింగ్

TG: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 48.54 శాతం పోలింగ్ నమోదైంది. మున్సిపాలిటీల్లో 51.66%, కార్పొరేషన్లలో 40.96% ఓటింగ్ నమోదైంది. మరోవైపు పోలింగ్ కేంద్రాల వద్ద జరిగే గొడవలపై డీజీపీ శివధర్ రెడ్డి స్పందించారు. అధికార పార్టీకి పోలీసుల మద్దతు అనేది అవాస్తవమని, నల్గొండ, కరీంనగర్‌లో జరిగినవి చిన్న గొడవలే అని తెలిపారు. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందన్నారు.
News February 11, 2026
మరో కేసులో అంబటి రాంబాబుకు బెయిల్

AP: వైసీపీ నేత అంబటి రాంబాబుకు మరో కేసులో గుంటూరు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే చంద్రబాబుపై వ్యాఖ్యల కేసులో బెయిల్ రాగా, తాజాగా మెడికల్ కాలేజీల PPP విధానంపై ఆందోళనల కేసులో బెయిల్ మంజూరు చేసింది. పోలీసుల కస్టడీ పిటిషన్‌ను తిరస్కరించింది. రేపు ఆయన జైలు నుంచి విడుదలయ్యే అవకాశముంది.
News February 11, 2026
ఆయిల్ పామ్: నత్రజని లోపం ఇలా గుర్తించండి

పంటకు పచ్చదనాన్ని కలిగించే పోషకం నత్రజని. మొక్కలో నత్రజని అవసరమైన దానికంటే తక్కువైతే ముదురు ఆకులు పచ్చదనాన్ని కోల్పోయి పాలిపోయి రంగు మారతాయి. పంట పెరుగుదల మందగించి, దిగుబడి తగ్గుతుంది. నత్రజని అధికమైతే మొక్కలు విపరీతంగా పెరిగి నేలకు ఒరగడం, సులభంగా చీడపీడలకు గురి కావడం, ఆలస్యంగా పూత రావడం జరుగుతుంది. అందుకే నత్రజని సరైన మోతాదులో నిపుణుల సూచనల మేరకు పంటకు అందించాలి.


