News January 5, 2026

బంగ్లాలో ఆగని దాడులు.. మరో హిందూ హత్య

image

బంగ్లాదేశ్‌లో హిందూ మైనార్టీలపై హింస ఆగడం లేదు. తాజాగా మరో వ్యక్తి గురయ్యాడు. మణిరాంపూర్‌లో రాణా ప్రతాప్ బైరాగి(45)ని దుండగులు తుపాకీతో కాల్చిచంపారు. ఇతడి తండ్రి స్కూల్ టీచర్‌గా పని చేస్తున్నారు. ఇప్పటికే ఖోకన్ దాసి, అమృత్ మండల్, దీపూ దాస్ వంటి <<18749458>>హిందువులు<<>> మూక దాడుల్లో హతమైన సంగతి తెలిసిందే. వరుస ఘటనలతో స్థానిక హిందువుల్లో భయాందోళనలు తీవ్రమయ్యాయి. తాజాగా హిందూ మహిళపై రేప్ ఘటన వెలుగుచూసింది.

Similar News

News February 22, 2026

వర్షం దెబ్బ.. పాకిస్థాన్ సెమీస్ లెక్కలు తలకిందులు!

image

కొలంబోలో శనివారం పాక్, న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన సూపర్-8 మ్యాచ్ వర్షం వల్ల రద్దయిన విషయం తెలిసిందే. రిజర్వ్ డే లేకపోవడంతో ఇరు జట్లు పాయింట్లను పంచుకున్నాయి. దీంతో పాక్ సెమీస్ చేరాలంటే తర్వాతి 2 మ్యాచుల్లో ఇంగ్లాండ్, శ్రీలంకపై కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్క మ్యాచ్ ఓడినా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఒకే ఒక్క పాయింట్‌తో సల్మాన్ అలీ ఆఘా సేన సెమీస్ పోరు క్లిష్టంగా మారింది.

News February 22, 2026

శగుణం అంటే తెలుసా?

image

మంచి, శుభప్రదాన్నే శగుణం అంటారు. ఇది సంస్కృత పదం. శుభకార్యాలప్పుడు దైవిక ఆశీస్సులు కోరుతూ బహుమతి రూపేణా శగుణం ఇస్తారు. ముఖ్యంగా వివాహ వేడుకలలో మనం దీన్ని చూడవచ్చు. పెళ్లికి ముందు జరిగే పలు వేడుకల్లో వధువు, వరుడి కుటుంబాలు నగలు, బట్టలు, మిఠాయిలు, డ్రై ఫ్రూట్స్ వంటివి శగుణంగా ఇచ్చిపుచ్చుకుంటారు. అయితే ఇది కేవలం వస్తు మార్పిడి మాత్రమే కాదు! రెండు కుటుంబాల మధ్య బంధాన్ని ఖరారు చేసే పవిత్రమైన ప్రక్రియ.

News February 22, 2026

65-10-10-15 ఫార్ములాతో మీ ఇన్వెస్ట్‌మెంట్ సేఫ్

image

మార్కెట్ అనిశ్చితిని తట్టుకోవడానికి 65-10-10-15 అనే మల్టీ-అసెట్ ఫార్ములా ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందులో 65% ఈక్విటీ, 15% డెట్, తలా 10% బంగారం, వెండిలో పెట్టుబడి పెట్టాలి. ‘బోరింగ్ థాలీ’గా పిలిచే ఈ విధానం వల్ల ఒక రంగం నష్టాల్లో ఉన్నా మరోటి లాభాలతో బ్యాలెన్స్ చేస్తుంది. మార్కెట్ ట్రెండ్స్ వెనక పరిగెత్తకుండా పెట్టుబడులను ఇలా విభిన్నంగా పంచుకుంటే రిస్క్ తగ్గి దీర్ఘకాలంలో సంపద పెరుగుతుంది.