News January 2, 2026

బంగ్లాలో పర్యటించనున్న టీమ్ ఇండియా!

image

భారత జట్టు ఈ ఏడాది SEPలో బంగ్లాలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది. గతంలో పోస్ట్‌పోన్ అయిన పర్యటనను రీషెడ్యూల్ చేసినట్లు BCB క్రికెట్ ఆపరేషన్స్ ఇన్-ఛార్జ్ తెలిపినట్లు క్రిక్‌బజ్ పేర్కొంది. ‘ఆగస్టు 28న టీమ్ ఇండియా బంగ్లాదేశ్ చేరుకుంటుంది. SEP 1, 3, 6వ తేదీల్లో వన్డేలు, 9, 12, 13వ తేదీల్లో T20లు ఆడుతుంది’ అని తెలిపింది. ఇరు దేశాల మధ్య నెలకొన్న దౌత్య విభేదాల నేపథ్యంలో ఈ పర్యటనకు ప్రాధాన్యం నెలకొంది.

Similar News

News February 15, 2026

పరిషత్ ఎన్నికకు పరీక్షల గండం!

image

TG: పరిషత్ ఎన్నికలకు అధికార పార్టీ సిద్ధమవుతోంది. కానీ వరుస పరీక్షల కారణంగా ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశముంది. FEB 25 నుంచి ఇంటర్, మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు, తర్వాత EAPCET వంటి పోటీ పరీక్షలు ఉన్నాయి. దీంతో ఎన్నికలకు షెడ్యూల్ రూపొందించడం సవాలుగా మారింది. కాగా మార్చి నెలాఖరులోగా పరిషత్ ఎన్నికలు జరగకపోతే 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన ₹498Cr ఆగిపోయే అవకాశముంది.

News February 15, 2026

అన్ని తండాలకు బీటీ రోడ్లు, సోలార్ పవర్: CM

image

TG: రాష్ట్రంలోని అన్ని తండాలకు బీటీ రోడ్లు, సోలార్ పవర్, స్కూళ్లు ఏర్పాటు చేస్తామని CM రేవంత్ తెలిపారు. HYDలో జరిగిన సంత్ శ్రీ సేవాలాల్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ‘4నెలల్లో 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకోబోతున్నా. ఈ ప్రస్థానంలో లంబాడా యువకులు అండగా నిలబడ్డారు. భూముల గురించి, తాత్కాలిక సంక్షేమం గురించి ఆలోచించకూడదు. బాగా చదువుకుంటే మీ భవిష్యత్ తరాలు బాగుపడతాయి’ అని వ్యాఖ్యానించారు.

News February 15, 2026

ఇండియా Vs పాక్.. జట్లు ఇవేనా?

image

ఇవాళ్టి హైఓల్టేజ్ మ్యాచ్ కోసం ఇండియా, పాక్ జట్లు రెడీ అవుతున్నాయి. ఎక్కువ మంది స్పిన్నర్లతో బరిలోకి దిగాలని భావిస్తున్నాయి. జట్ల అంచనా ఇలా..
IND: అభిషేక్, ఇషాన్, తిలక్, సూర్య(C), హార్దిక్, శివమ్ దూబే, రింకూ, అక్షర్ పటేల్, సుందర్/కుల్దీప్, బుమ్రా, వరుణ్.
PAK: అయూబ్, ఫర్హాన్, సల్మాన్ అఘా(C), బాబర్ ఆజమ్, ఉస్మాన్ ఖాన్, ఫహీమ్, షాదాబ్ ఖాన్, షహీన్ అఫ్రీది, అబ్రార్ అహ్మద్, ఉస్మాన్ తారిఖ్, సల్మాన్ మీర్జా.