News February 6, 2026

బంగ్లా ఎన్నికలు: మ్యానిఫెస్టోల్లో ఇండియా, హిందువుల ప్రస్తావన

image

Feb 12న బంగ్లాలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు మ్యానిఫెస్టోలను ప్రకటించాయి. తారిఖ్ రెహ్మాన్ నేతృత్వంలోని BNP ‘బంగ్లా ఫస్ట్’ నినాదంతో హిందువుల ఆస్తులు, ప్రార్థనా స్థలాలకు చట్టపరమైన రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చింది. భారత్‌ను యజమానిలా కాకుండా మిత్రుడిలా చూస్తామని పేర్కొంది. మరోవైపు జమాత్-ఎ-ఇస్లామీ భారత్‌తో సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు తెలిపినా హిందువుల రక్షణపై మాత్రం మౌనం వహించింది.

Similar News

News February 7, 2026

KNR:అక్రిడిటేషన్ కార్డుల జారీకి ఆన్లైన్ దరఖాస్తులు: కలెక్టర్

image

సమాచార పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో 2026–28కి జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా అక్రెడిటేషన్ కమిటీ ఛైర్ పర్సన్, కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఈ నెల 9 నుంచి ఆన్లైన్ లో దరఖాస్తులు సమర్పించాలని యాజమాన్యాల ద్వారా పంపిన పేర్లలో ఉన్న జర్నలిస్టులు సమాచార పౌరసంబంధాల శాఖ అధికారిక వెబ్ సైట్ http://ipr.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

News February 7, 2026

పేరెంట్స్‌ను చూసుకోవడానికి 45 రోజుల సెలవు ఇవ్వాలి: ఎంపీ

image

60 ఏళ్లు నిండిన పేరెంట్స్‌ను చూసుకోవడానికి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని ఉద్యోగులకు 45 రోజుల సెలవు ఇవ్వాలని UP MP సుమిత్ర రాజ్యసభలో ప్రతిపాదించారు. ‘ప్రస్తుతం దేశంలో సీనియర్ సిటిజన్‌ల సంఖ్య 14.9Crగా ఉంది. 2036 నాటికి ఈ సంఖ్య 23Cr దాటుతుంది. ప్రతి ముగ్గురిలో ఒక వృద్ధుడు ఉంటారు. ప్రస్తుతం ఉద్యోగ ఒత్తిళ్లతో తల్లిదండ్రుల ఆలనాపాలనా చూసుకోవడం కష్టమవుతోంది. అందుకే సెలవులివ్వాలి’ అని పేర్కొన్నారు.

News February 7, 2026

40 దాటిందా? ఇవి తినండి..

image

నలభై దాటిన తర్వాత మహిళలు ప్రీ మెనోపాజ్ స్థితికి వస్తారు. ఈ సమయంలో శరీరంలో హార్మోన్ల మార్పులు ఎక్కువగా ఉంటాయి. వీటిని సమతుల్యం చేయడానికి డైట్‌లో ఐరన్, ఫోలేట్, విటమిన్ B12 చేర్చుకోవాలంటున్నారు న్యూట్రిషనిస్టులు. వీటి కోసం బీట్‌రూట్, మాంసం, పాలకూర, బ్రోకలీ, నారింజ, గుడ్లు, పాలు, చేపలు తీసుకోవాలని చెబుతున్నారు. ✍️ మహిళల్లో 40ఏళ్ల తర్వాత వచ్చే వ్యాధుల గురించి తెలుసుకోవడానికి <<-se_10014>>వసుధ కేటగిరీ<<>>కి వెళ్లండి.