News October 10, 2025
బంజారాహిల్స్‌లో రూ.750 కోట్ల భూమి స్వాధీనం

బంజారాహిల్స్ 5 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. రూ.750 కోట్ల విలువైన భూమి ఇది. ఫేక్ సర్వే నంబర్ 403/52తో ఓ వ్యక్తి భూమి తనదంటూ క్లెయిమ్ చేసుకొని ఫెన్సింగ్, షెడ్లు, బౌన్సర్లు, కుక్కలతో కాపలా ఏర్పాటు చేశారు. జలమండలి వాటర్ రిజర్వాయర్ పనులను అడ్డుకున్నాడు. దీనిపై హైడ్రా అధికారులకు సమాచారం అందింది. శుక్రవారం ఉదయం నుంచి హైడ్రా, రెవెన్యూ, జలమండలి సంయుక్తంగా కూల్చివేతలు చేపట్టారు.
Similar News
News October 10, 2025
అందం కోసం ఆరాటం ప్రాణాలను తీసింది

అందం కోసం సర్జరీలు చేయించుకొనే వారు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అదే ప్రాణాల మీదకు తెస్తుంది. తాజాగా FOX EYES (నీలి కళ్లు) కోసం కాస్మొటిక్ సర్జరీ చేయించుకున్న బ్రెజిలియన్ ఇన్‌ఫ్లుయెన్సర్ అడైర్ మెండెస్ దత్రా(31) చనిపోయారు. సర్జరీతో ఆమెకు సివియర్ ఫేషియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చాయి. ఊపిరి కూడా అందక మరణించారు. సర్జరీ తర్వాత సరైన పోషకాహారం ఇతర జాగ్రత్తలు పాటించాలని ప్లాస్టిక్ సర్జన్ కిరణ్మయి సూచించారు.
News October 10, 2025
జైస్వాల్ 150 రన్స్ నాటౌట్

వెస్టిండీస్‌తో రెండో టెస్టులో IND ఓపెనర్ జైస్వాల్ 150 పరుగులు పూర్తి చేసుకున్నారు. ఆయన ఇన్నింగ్స్‌లో 19 ఫోర్లున్నాయి. అటు టెస్టుల్లో వేగంగా(71 ఇన్నింగ్స్‌లు) 3వేల రన్స్ చేసిన రెండో IND బ్యాటర్‌గా జైస్వాల్ నిలిచారు. తొలి ప్లేస్‌లో గవాస్కర్(69 ఇన్నింగ్స్‌లు) ఉన్నారు. మరోవైపు సుదర్శన్ 87 రన్స్ వద్ద ఔటై సెంచరీ మిస్ చేసుకున్నారు. ప్రస్తుతం క్రీజులో జైస్వాల్‌తో పాటు గిల్(15) ఉన్నారు. IND స్కోర్ 294/2.
News October 10, 2025
8,113 ఉద్యోగాలు.. అడ్మిట్ కార్డులు విడుదల

RRB 8,113 NTPC గ్రాడ్యుయేట్ పోస్టులకు అడ్మిట్ కార్డులను విడుదల చేసింది. స్టేజ్ 2 కంప్యూటర్ ఆధారిత పరీక్ష అక్టోబర్ 13న నిర్వహించనుంది. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ ఎంటర్ చేసి అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇటీవల సీబీటీ -1 ప్రాథమిక కీ, కట్ ఆఫ్ మార్కుల వివరాలను రైల్వే బోర్డు ప్రకటించింది. వెబ్‌సైట్: https://www.rrbapply.gov.in/