News October 17, 2025

బంజారాహిల్స్: బంద్ ఫర్ జస్టిస్‌కు కవిత మద్దతు

image

‘బంద్ ఫర్ జస్టిస్’కు మద్దతునివ్వాలని కోరుతూ ‘తెలంగాణ బీసీ జేఏసీ’ ఛైర్మన్ ఆర్.కృష్ణయ్య తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకి లేఖ రాశారు. బంద్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు కవిత ప్రకటించారు. బీసీల రిజర్వేషన్ల పెంపుపై మాట్లాడేందుకు కాంగ్రెస్, బీజేపీకి అర్హత లేదన్నారు. రెండు జాతీయ పార్టీలు బీసీలను వంచిస్తున్నాయని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంపిన బిల్లులను బీజేపీ కావాలనే పెండింగ్‌లో పెడుతోందన్నారు.

Similar News

News October 17, 2025

కామారెడ్డి: విద్యుత్ షాక్ తగిలి యువకుడి మృతి

image

నాగిరెడ్డి పేటలో శుక్రవారం విద్యుత్ షాక్ తగిలి ఓ యువకుడు మృతి చెందాడు. ఎస్సై భార్గవ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌ చిత్తూరు(D) రామసముద్రం గ్రామానికి చెందిన సయ్యద్ చోటు బాతులను మేపుకుంటూ వెళ్తుండగా కొన్ని బాతులు పొలంలోకి వెళ్లాయి. వాటిని తీసుకురావడానికి వెళ్లగా పొలంలో స్టాటర్ డబ్బా వైర్లు అతని కాలుకు తగిలి షాక్‌కు గురయ్యాడు. స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News October 17, 2025

శ్రీనిధి రుణాలు సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

image

జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలు DRDA వెలుగు ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీనిధి రుణాలను సద్వినియోగంచేసుకొని అభివృద్ధి చెందాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ పేర్కొన్నారు. శుక్రవారం శ్రీనిధి గోడ పత్రికలను కలెక్టర్‌తో కలిసి పీడీ నరసయ్య ఆవిష్కరించారు. శ్రీనిధి ద్వారా మహిళా సంఘాల మహిళలు తమ జీవనోపాధి పెంపొందించుకోవడానికి ఇతర ఆర్థికఅవసరాలకు తక్కువ వడ్డీతో రుణ సదుపాయం పొందవచ్చని కలెక్టర్ తెలిపారు.

News October 17, 2025

నవంబర్ 11న సెలవు

image

TG: నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ నేపథ్యంలో ఆ రోజున నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఈ నియోజకవర్గంలో ఓటు కలిగి ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్ ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.