News July 29, 2024
బండారు దత్తాత్రేయను కలిసిన ఆర్మూర్ ఎమ్మెల్యే

ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయను హైదరాబాద్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. హర్యానా గవర్నర్ ఆహ్వానం మేరకు బోనాల పండుగ సందర్భంగా విందుకు వెళ్లినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. బండారు దత్తాత్రేయ అంటే పార్టీలకు సంబంధం లేకుండా అందరూ ఇష్టపడే వ్యక్తి అని ఆయన అన్నారు. అనంతరం ఆయనతో పలు రాజకీయ అంశాలు చర్చించారు.
Similar News
News November 11, 2025
హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: టీయూ విద్యార్థి సంఘాలు

తెలంగాణ యూనివర్సిటీలో 2012 లో జరిగిన నియామకాలు చెల్లవని ఇచ్చిన హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని NSUI,PDSU నాయకులు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం సమావేశంలో NSUI, వర్సిటీ మాజీ అధ్యక్షుడు శ్రీశైలం,PDSU నాయకులు అనిల్ కుమార్ మాట్లాడారు.తప్పుడు పత్రాలతో నియామకం అయిన వారిని తొలగించి,హైకోర్టు తీర్పును పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్ చేశారు.నాయకులు రాజు, గోవింద్,మహేష్,అరుణ,పవిత్ర,నవీన్ తదితరులున్నారు.
News November 11, 2025
నిజామాబాద్ జిల్లాలో ఉద్యోగ మేళా

నిజామాబాద్ జిల్లా నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 13న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి మధుసూదన్ రావు తెలిపారు. ఇంటర్, డిగ్రీ, ఐటీఐ చేసిన యువతి, యువకులు అర్హులని, ఆసక్తి ఉన్నవారు పాల్గొనాలని సూచించారు. వయస్సు18 నుంచి 30 లోపు వారు ధ్రువపత్రాలతో జిల్లా ఉపాధి కార్యాలయానికి రావాలని తెలిపారు.
News November 11, 2025
NZB: ఘనంగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి

కేంద్ర తొలి విద్యాశాఖ మంత్రి అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ టి. వినయ్ కృష్ణారెడ్డి, ఇతర జిల్లా అధికారులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన దేశానికి అందించిన సేవలను వక్తలు గుర్తు చేసుకున్నారు.


