News August 3, 2024
బండారు శ్రావణికి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ
ఎమ్మెల్యే బండారు శ్రావణికి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు ఎమ్మెల్యేలు, నేతలు బర్త్ డే విషెస్ చెబుతూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. పుట్లూరు, నార్పల, బుక్కరాయసముద్రం, గార్లదిన్నె, ఎల్లనూరు మండలాల్లో టీడీపీ కార్యకర్తలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఆసుపత్రిలో పండ్లు, బ్రెడ్ వంటివి పంపిణీ చేశారు. 1990 ఆగస్టు 3న జన్మించిన శ్రావణి ఈ ఎన్నికల్లో తొలిసారి MLA అయిన విషయం తెలిసిందే.
Similar News
News January 21, 2025
నేడు పుట్టపర్తిలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు
పుట్టపర్తిలో నేడు జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు శ్రీ సత్యసాయి జిల్లా రవాణా శాఖ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు ప్రశాంతి గ్రామంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో కలెక్టర్ చేతన్, ఎస్పీ రత్న, ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి పాల్గొంటారని పేర్కొన్నారు. ఇందులో రహదారి భద్రత నియమాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.
News January 20, 2025
కానిస్టేబుల్ అభ్యర్థులకు అనంతపురం ఎస్పీ సూచన
అనంతపురం జిల్లాలో కానిస్టేబుల్ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలకు వివిధ కారణాలతో గైర్హాజరైన వారికి మంగళవారం అవకాశం కల్పిస్తున్నట్లు ఎస్పీ జగదీశ్ తెలిపారు. జిల్లాలో గత నెల 30 నుంచి దేహదారుఢ్య పరీక్షలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఈ రోజుల్లో గైర్హాజరు అయిన వారు రేపు పరీక్షల్లో పాల్గొనాలని కోరారు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News January 20, 2025
హిందూపురంలో భర్త హత్య.. భార్య, ప్రియుడి అరెస్ట్
తమ అక్రమ సంబంధానికి భర్త అడ్డువస్తున్నాడని భావించిన భార్య, ప్రియుడితో కలిసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తాజాగా భార్య తబుసం, ప్రియుడు నదీముల్లాను అరెస్ట్ చేసినట్లు హిందూపురం డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ అబ్దుల్ కరీం తెలిపారు. ఈ నెల 18న అల్లా బకాశ్ ఇంట్లో నిద్రిస్తుండగా భార్య తబుసం, ప్రియుడితో కలిసి గొంతు నులిమి చంపారని తెలిపారు. నిందితులను రిమాండ్‌కు తరలిస్తామని వివరించారు.