News September 22, 2025

బండారు సూచనలపై స్పందించిన స్పీకర్

image

నాన్ షెడ్యూల్ ఏరియాలో గిరిజనులకు న్యాయం చేయాలని ప్రస్తావిస్తు బండారు సత్యనారాయణమూర్తి చేసిన సూచనలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు స్పందించారు. నాన్ షెడ్యూల్ ఏరియాలో గిరిజనులకు న్యాయం జరిగే విధంగా ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి త్వరితగతిన పంపించాలని సంబంధిత మంత్రి, అధికారులను స్పీకర్ ఆదేశించారు. ఈ విషయంలో జాప్యం చేయవద్దన్నారు.

Similar News

News September 22, 2025

దసరా తర్వాత జూబ్లీహిల్స్ ఉపఎన్నిక షెడ్యూల్?

image

TG: దసరా తర్వాత జూబ్లీహిల్స్ బైపోల్‌కు షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. అక్టోబర్ తొలివారంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికల <<17788984>>డేట్స్<<>> ప్రకటించాలని కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. దాంతో పాటు జూబ్లీహిల్స్ సహా దేశంలోని మరిన్ని నియోజకవర్గాలకు షెడ్యూల్ ప్రకటిస్తుందని సమాచారం. ఇప్పటికే ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాలు, తదితర ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ఈసీకి పూర్తి నివేదిక సమర్పించారు.

News September 22, 2025

అనకాపల్లి నూకాంబిక ఆలయంలో శరన్నవరాత్రి మహోత్సవాలు

image

అనకాపల్లి శ్రీనూకాంబిక అమ్మవారు ఆలయంలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ముందుగా గణపతి పూజ, కలశ స్థాపన, అగ్ని ప్రతిష్ఠ చేశారు. అనంతరం దసరా ఉత్సవాలను జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ప్రారంభించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్ సుధారాణి, ఉత్సవ కమిటీ మాజీ చైర్మన్ పీలా నాగశ్రీలు పాల్గొన్నారు.

News September 22, 2025

VKBలో 14 పత్తి కొనుగోలు కేంద్రాలు

image

VKB జిల్లాలో పత్తి కొనుగోలు కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో తాండూరు, పరిగి, VKB మార్కెట్లలో కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో ఈసారి సీసీఐ ఏర్పాటు చేసే 14 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు జిల్లా అధికారి సారంగపాణి తెలిపారు. తాండూరు, పరిగి, VKB విపణుల పరిధిలో ఒక్కో మూడేసి చొప్పున కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.