News April 11, 2024
బండి సంజయ్ రూ.12వేల కోట్ల నిధులు తీసుకువచ్చారు: రాణి రుద్రమ

భారతదేశంలో అందరు ఎంపీల కంటే ప్రజా సమస్యలపై పోరాటం చేసిన బండి సంజయ్ పై అత్యధిక కేసులు ఉన్నాయని బీజేపీ నాయకురాలు రాణి రుద్రమదేవి అన్నారు. గురువారం కరీంనగర్‌లోని పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. పాదయాత్రతో ప్రజా సమస్యలు తెలుసుకున్న వ్యక్తి బండి సంజయ్ అన్నారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధికి రూ.12 వేల కోట్ల నిధులు ఎంపీ బండి సంజయ్ తీసుకువచ్చారని తెలిపారు.
Similar News
News July 7, 2025
పోరండ్లలో నకిలీ వైద్యుడి క్లినిక్.. గుర్తించిన టీజీ ఎంసీ బృందాలు

తిమ్మాపూర్ మండలం పోరండ్లలో అర్హత లేకుండా డాక్టర్‌గా చలామణి అవుతూ అనుమతి, ఏ రకమైన బోర్డు లేకుండా నిర్వహిస్తున్న అల్లోపతి క్లినిక్‌ను తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందాలు గుర్తించాయి. నకిలీ వైద్యుల క్లినిక్‌లపై తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో పోరండ్లలో రవీందర్ రెడ్డి అనే నకిలీ వైద్యుడు రోగులకు యాంటీబయాటిక్ ఇంజెక్షన్‌లు, స్టెరాయిడ్ ఇంజెక్షన్‌లు, పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్‌లు ఇస్తున్నట్లు గుర్తించారు.
News July 7, 2025
నేడు కరీంనగర్‌లో మంత్రుల పర్యటన

కరీంనగర్‌లో నేడు మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీహరి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనలు పర్యటించనున్నారు.
ఉ.9:30 గం.కు పాత ఆర్ట్స్ కళాశాల వద్ద నూతన పాఠశాల భవనాన్ని ప్రారంభిస్తారు.
10 గం.లకు అంబేడ్కర్ స్టేడియంలో వన మహోత్సవంలో పాల్గొంటారు.
11గం.కు చేప పిల్లల పెంపకం పరిశీలించి ముదిరాజ్ సంఘాలతో సమావేశమవుతారు.
11:30గంకు క్రీడా పాఠశాల, ఈతకొలను ప్రారంభించి వివిధ క్రీడా సంఘాలతో సమావేశమవుతారు.
News July 7, 2025
కరీంనగర్: మహిళలు వేధింపులకు గురవుతున్నారా..?

వేధింపులు ఎదురైతే ఏం చేయాలి? ఎవరి సహాయం కోరాలి? ఇలా అయోమయంలో పడే మహిళలకు భరోసాగా మారుతోంది కరీంనగర్ జిల్లాలోని షీ టీం. మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ బృందం నిత్యం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మహిళా చట్టాలు, రక్షణకోసం తీసుకుంటున్న చర్యలపై తెలియజేస్తోంది. వేధింపులు ఎదురైతే 8712670759 నంబర్‌కు ఫోన్ చేయాలని, ఆన్‌లైన్ మోసాలకు గురైతే 1930 సైబర్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు.