News August 11, 2025
బందరులో హర్ ఘర్ తిరంగా ర్యాలీ

బందరు కలెక్టరేట్ నుంచి లక్ష్మీ టాకీస్ సెంటర్ వరకు జాతీయ పతాకాలతో హర్ ఘర్ తిరంగా ర్యాలీ సోమవారం నిర్వహించారు. జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖరరావు మాట్లాడుతూ.. ప్రతి ఇంటిపై జాతీయ పతాకం ఎగరేయాలని, స్వదేశీ ఉత్పత్తుల తయారీ, కొనుగోళ్లు ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. అవగాహన కార్యక్రమాలు, క్విజ్‌లు, ఫోటో ప్రదర్శనలు కూడా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News September 4, 2025
కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని వినతి

కృష్ణా జిల్లాకు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని రాధా-రంగా మిత్ర మండలి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు బుల్లెట్ ధర్మారావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌ను కోరారు. మచిలీపట్నం పర్యటనకు వచ్చిన మాధవ్‌ను కలిసిన ఆయన ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మాధవ్ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
News September 4, 2025
కృష్ణా: యూరియా సరఫరాలో ఇబ్బంది ఉంటే.. ఇలా చేయండి.!

జిల్లాలో యూరియా కొరతలేదని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. రైతుల అవసరాల కోసం ఇతర జిల్లాల నుంచి యూరియాను తెప్పిస్తున్నామని చెప్పారు. శుక్రవారం పల్నాడు జిల్లా నుంచి 300 మెట్రిక్ టన్నులు, పశ్చిమగోదావరి నుంచి 200 మెట్రిక్ టన్నులు వస్తాయని తెలిపారు. ఈ యూరియాను PACS ద్వారా రైతులకు అందుబాటులో ఉంచుతామని, సమస్యలు ఉంటే 08672-252572లో సంప్రదించవచ్చన్నారు.
News September 4, 2025
కృష్ణా జిల్లాలో 73 ఎస్సీ గ్రామాలకు శ్మశానాలు లేవు

కృష్ణా జిల్లాలో 73 ఎస్సీ గ్రామాలకు శ్మశానవాటికలు లేవని ఎస్సీ సంక్షేమ శాఖ గుర్తించింది. ఈ మేరకు గుడివాడలో 15, మచిలీపట్నంలో 15, ఉయ్యూరులో 43 గ్రామాలకు మొత్తం 72.98 ఎకరాలు కేటాయించాలని కోరుతూ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఈ నివేదికను తాజాగా భూసేకరణ చీఫ్ కమిషనర్ (CCLA)కు అందజేసింది.