News April 18, 2024
బందోబస్తు పర్యవేక్షణకు పోలీసు అధికారులు

నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ప్రతి ఆర్వో ఆఫీసు వద్ద శాంతిభద్రతల పర్యవేక్షణ బాధ్యతలను DSPలకు అప్పగించారు. నెల్లూరు ఎంపీ నామినేషన్ కేంద్రం వద్ద ఏఎస్పీ సౌజన్య, నెల్లూరు సిటీలో శ్రీనివాసులు రెడ్డి, రూరల్‌లో రామకృష్ణాచారి , కోవూరులో శ్రీనివాసులు, సర్వేపల్లిలో వీరాంజనేయరెడ్డి, ఆత్మకూరులో కోటారెడ్డి, కావలిలో వెంకటరమణ, ఉదయగిరిలో సాయినాథ్ పర్యవేక్షిస్తారు.
Similar News
News October 8, 2025
నెల్లూరులో స్మార్ట్ స్ట్రీట్ ఓపెనింగ్ ఎప్పుడో..?

పొదుపు మహిళలకు ఆర్థిక తోడ్పాటు అందించాలనే లక్ష్యంతో నెల్లూరులో పైలట్ ప్రాజెక్టుగా <<17847829>>స్మార్ట్ స్ట్రీట్<<>> ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈక్రమంలో చాలా రోజుల కిందటే అక్కడి దుకాణాల ముందు భాగాలను తొలగించారు. కంటైనర్లతో స్మార్ట్ దుకాణాలు ఏర్పాటు చేశారు. దసరా తర్వాత ప్రారంభించాలని 4వ తేదీన ముహూర్తం కుదిర్చారు. ఏమైందో ఏమో ఓపెనింగ్‌ను మర్చిపోయారు. వీటిని ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారో చూడాలి మరి.
News October 8, 2025
నెల్లూరు: దాహం తీర్చేవారేరి..!

దుత్తలూరు(M) నందిపాడు ఎస్సీ కాలనీ, వరికుంటపాడు(M) దక్కనూరు, వింజమూరు(M) కాటేపల్లి బీసీ కాలనీ, కొడవలూరు(M)గండవరంలో RO ప్లాంట్ల ఏర్పాట్లల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. వీటిల్లో రూ.29 లక్షలతో ప్లాంట్లను నెలకొల్పాలని తీర్మానించారు. వీకేపాడులో కేవలం భవనం కట్టి వదిలేయగా, మరికొన్ని చోట్ల పనులే ప్రారంభం కాలేదు. దీనిపై విమర్శలు వస్తున్నాయి. అధికారులు వీటిపై పునఃసమీక్షించాలని ప్రజలు కోరారు.
News October 8, 2025
నెల్లూరులో మర్డర్స్.. పోలీసుల అదుపులో నిందితులు?

నెల్లూరు రంగనాయకుల గుడి వెనుక వైపు ఉన్న వారధి వద్ద డబుల్ మర్డర్ జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించినట్లు సమాచారం. ఎస్పీ డా.అజిత వెజెండ్ల, DSP సింధూ ప్రియ పర్యవేక్షణలో సంతపేట CI దశరథ రామారావు విచారణ చేపట్టారు. హత్య చేసిన వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నేడే, రేపో నిందితుల వివరాలు బహిర్గతం చేస్తారని తెలుస్తోంది.