News December 29, 2025

బకాల్‌వాడ: 44 వసంతాల ఆత్మీయ కలయిక

image

మిర్యాలగూడ పట్టణంలోని బకాల్ వాడ ఉన్నత పాఠశాలలో 44 వసంతాల ఆత్మీయ కలయికతో 1980-81లో 10వ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పూర్వ విద్యార్థులు నాటి మధుర జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. పాఠశాలలో మొదలైన స్నేహం ఎంతో అపురూపమని, స్నేహ బంధం విలువ వెలకట్టలేనిది వారిలో ఒకరైన పూర్వ విద్యార్థి రామశేఖర్ అన్నారు.

Similar News

News December 29, 2025

NLG: యాప్ సమస్యలు వీడాలి.. కొనుగోళ్లు సాఫీగా సాగాలి: కలెక్టర్

image

బ్యాంకుల్లో క్లెయిమ్ చేయకుండా పేరుకుపోయిన రూ.66 కోట్ల అపరిష్కృత ఖాతాల సొమ్మును సంబంధిత వారసులకు చేరేలా అవగాహన పెంచాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజావాణిలో ఆమె పలు శాఖల పనితీరుపై సమీక్షించారు. పత్తి రైతులకు ఇబ్బందిగా మారిన యాప్ సమస్యలను పరిష్కరించాలని, ఎరువుల పంపిణీలో పారదర్శకత పాటించాలని ఆదేశించారు. రహదారి భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నామని కలెక్టర్ పేర్కొన్నారు.

News December 29, 2025

NLG: యూరియా పంపిణీలో పారదర్శకత ఉండాలి: కలెక్టర్

image

రైతులకు యూరియా పంపిణీ ప్రక్రియలో ఎటువంటి లోపాలు లేకుండా నిరంతర నిఘా ఉంచాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠీ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. సాగు పనుల దృష్ట్యా ఎరువుల పంపిణీ వద్ద వివాదాలు చోటుచేసుకోకుండా మండల ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు. పత్తి కొనుగోలు కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్‌లో తలెత్తే సాంకేతిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు.

News December 29, 2025

యాసంగి ప్రారంభంలోనే రైతన్నకు కష్టాలు!

image

అన్నదాతలకు యాసంగి ప్రారంభంలోనే కష్టాలు మొదలయ్యాయి. గత 15 రోజులుగా జిల్లాలో ఉష్ణోగత్రలు సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యాయి. దీంతో వరి నాటు వేసిన పొలాలు చలికి దెబ్బతింటున్నాయి. జిల్లా వ్యాప్తంగా రబీలో 5,64,678 ఎకరాల్లో వరి, వేరుశనగ ఇతర రకాల పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేశారు. కాగా వేసిన నాట్లు ఏమాత్రం ఎదగకపోగా చలి తీవ్రతకు నాటంతా చనిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.