News January 10, 2025
బజార్హత్నూర్: ముగ్గురి మృతికి కారణమైన ఆటో డ్రైవర్ అరెస్ట్

అతిగా మద్యం తాగి ఆటో నడిపి ముగ్గురి మృతికి కారణమైన ఆటో డ్రైవర్ పాలెపు రాకేష్ ను గురువారం అరెస్టు చేసినట్లు బోథ్ సీఐ వెంకటేశ్వర రావు తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 7న రాకేష్ అతిగా మద్యం తాగి, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకొని ఆటోను అజాగ్రత్తగా నడపడంతో బజార్హత్నూర్ మండలం దేగామ శివారులో ఆటో బోల్తా పడిందని, ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా, గాయపడిన వారు చికిత్స పొందుతున్నారన్నారు.
Similar News
News November 1, 2025
ఆదిలాబాద్: ప్రభుత్వ పథకాలపై సమగ్ర అధ్యయనం

క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ పథకాలపై సమగ్ర అధ్యయనం చేయాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. శనివారం అధ్యయనం నిమిత్తం జిల్లాకు వచ్చిన IAS, IPS, IRS, IES, ISS అధికారులకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. సమావేశంలో DFO ప్రశాంత్ బాజీరావు పాటిల్, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, అదనపు ఎస్పీ కాజల్, శిక్షణ కలెక్టర్ సలోని చబ్రా, అధికారులు పాల్గొన్నారు.
News November 1, 2025
ADB: స్వయం ఉపాధి దిశగా యువత ముందుకు రావాలి: కలెక్టర్

ప్రభుత్వం అందిస్తున్న నైపుణ్యాభివృద్ధి అవకాశాలను యువత పూర్తిగా వినియోగించుకోవాలని కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. శనివారం ఆదిలాబాద్‌లోని టీటీడీసీ భవనంలో నిర్వహించిన ఇందిరమ్మ సెంట్రింగ్ యూనిట్ ట్రైనింగ్ ప్రోగ్రాం ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలను సృష్టిస్తున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు.
News November 1, 2025
భీంపూర్‌లో పులి సంచారం

భీంపూర్ మండలంలో పులి సంచారం రైతులకు కునుకు లేకుండా చేస్తుంది. శనివారం ఉదయం పిప్పల్ కోటి, గూడ గ్రామాల శివారులోని యాల్ల కేశవ్, పొగుల రమేశ్ పంట పొలాల్లో పులి కనిపించింది. గమనించిన కూలీలు భయంతో ఇంటికి వెళ్లిపోయినట్లు గ్రామస్థలుు తెలిపారు. కాగా ప్రస్తుతం పులి గర్భం దాల్చినట్లు గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేశారు.


